శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 ఆగస్టు 2022 (13:25 IST)

70 ఏళ్ల వయస్సులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ

new born baby
70 ఏళ్ల వయస్సులో తొలిసారిగా మగబిడ్డకు జన్మనిచ్చారు.. రాజస్థాన్ మహిళ. దీంతో తల్లిదండ్రులు కావాలన్న తమ కలను పెళ్లైన 54 ఏళ్ల తర్వాత నెరవేర్చుకుంది ఆ జంట.
 
వివరాల్లోకి వెళితే..రాజస్థాన్‌లోని ఆల్వార్ జిల్లా, ఝున్‌ఝును ప్రాంతానికి చెందిన చంద్రావతి-గోపీ సింగ్ అనే జంటకు పెళ్లై 54 ఏళ్లైనా సంతానం లేదు. ప్రస్తుతం గోపీ సింగ్ వయసు 75 కాగా, చంద్రావతి వయసు 70. వీరిద్దరూ సంతానం కోసం చాలా ఏళ్లుగా ప్రయత్నించారు. 
 
ఈ క్రమంలో ఆల్వార్ జిల్లాలో ఉన్న ఒక ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) సెంటర్‌ ద్వారా ఐవీఎఫ్ విధానంలో ప్రయత్నించారు. మూడోసారి ఆ ట్రీట్మెంట్ విజయవంతమైంది. దాదాపు తొమ్మిది నెలల క్రితం ఐవీఎఫ్ విధానంలో చంద్రావతి గర్భం దాల్చింది. 
 
అయినప్పటికీ ఆమె వయసు ఎక్కువ కావడం వల్ల సంతానం విషయంలో వైద్యులు కొంత సందేహించారు. అయితే, ఏ ఇబ్బందీ లేకుండా గత సోమవారం ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. బిడ్డ దాదాపు మూడున్నర కేజీల బరువున్నట్లు వైద్యులు చెప్పారు.