సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 జనవరి 2023 (16:47 IST)

'అక్కినేని.. తొక్కినేని' అనే మాటలు ఫ్లోలో వచ్చాయి.. రాద్దాంతం వదు : బాలకృష్ణ

balakrishna
ఇటీవల హీరో నందమూరి బాలకృష్ణ దివంగత నటుడు అక్కినేని నాగేశ్వర రావును ఉద్దేశించి "అక్కినేని.. తొక్కినేని" అంటూ వ్యాఖ్యానించారు. ఇవి వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై అక్కినేని మనవళ్లు స్పందించారు. దివంగత ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్‌లు సినీ కళామతల్లి ముద్దుబిడ్డలని వారిని అవమానిస్తే మనల్ని మనం అవమానించుకున్నట్టేనని వ్యాఖ్యానించారు. తాజాగా ఎస్వీ రంగారావు కుమారులు కూడా స్పందించారు. దీంతో నందమూరి బాలకృష్ణ స్పందించక తప్పలేదు. 
 
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ఏదో ఫ్లోలో అనేశానని చెప్పారు. ఈ మాటలను రాద్ధాంతం చేస్తున్నారని, ఇది విచారించదగ్గ విషయమన్నారు. అక్కినేని నాగేశ్వర రావుగారిని తాను బాబాయ్‌గా భావిస్తానని చెప్పారు. 
 
ఆయన పిల్లల కంటే తనను ఆయన ఎక్కువ ప్రేమగాను, ఇష్టంగా చూసుకునేవారు, ఎందుకంటే అక్కడ ఆప్యాయత లేదు. ఇక్కడ ఉంది అని బాలయ్య వెల్లడించారు. బాబాయ్ పట్ల నా గుండెల్లో ప్రేమ ఉంది. బయట ఏవో అంటుంటారు. అవన్నీ నేను పట్టించుకోను అని స్పష్టం చేశారు. 
 
ఎన్టీఆర్, ఎన్నార్‌లను అభిమానంతో ఎలా పిలుస్తారో తెలిసిందే కదా. రామారావును అభిమానంతో ఎన్టీవోడు అంటారు. ఎఎన్నార్‌ను నాగిగాడు అంటారా లేదా? అభిమానంతో అలా అంటారు. నేను ప్రచారానికి వెళ్లినపుడు నాకు కూడా ఇలాంటి మాటలు ఎదురవుతుంటాయి వాళ్ల యాసలో ఏదో ఒక పదం జోడించి.. వెళ్లిపోతున్నాడ్రా అని అంటారు. అది వాళ్ల అభిమానం. 
 
మనకు ఆప్తులైన వాళ్ల గురించి మనం కూడా అభిమానంతో అపుడపుడు మాట్లాడుతుంటాం. ఒక్కోసలారి మనం తాడోపేడే అని అంటుంటాం. అందులోపేడు అంటే అర్థం ఏంటి. ఏవో మాటలు కొన్నిసార్లు అలా వచ్చేస్తాయి. వాటిని తప్పుపడితే ఎలా? ప్రేమకొద్దీ అన్న మాటలను కూడా రాద్దాంతం చేసి దుష్ప్రచారం చేస్తే నాకు సంబంధం లేదు అని బాలకృష్ణ అన్నారు.