ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 30 నవంబరు 2023 (11:55 IST)

మనిషి గుణం, వాడు చేసిన అభివృద్ధిని చూసి ఓటు వెయ్యండి

Chiru-sureka
Chiru-sureka
తెలంగాణకు చెందిన 2023 ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. సినీ ఇండస్ట్రీ అంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ లోని పబ్లిక్ స్కూల్ లో కొందరు, ఎఫ్.ఎన్.సి.సి. లో మరికొందరు, బంజారా హిల్స్ లో మరికొందరు తమ ఓటు హక్కును వినియోగించుకుని మీరు ఓటు వేయండి అంటూ వెల్లడిస్తున్నారు. ఇక ‘కారు’లో వచ్చి సతీసమేతంగా ఓటు వేసిన మెగాస్టార్ చిరంజీవి. ఉదయం ఏడు గంటలకే తన భార్య సురేఖ తో వచ్చి లైన్ లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
 
Balakrishna family
Balakrishna family
నందమూరి బాలక్రిష్ణ తన కుటుంబంతో సహా జూబ్లీహిల్స్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మీ నాయకుడిని మీరే ఎంచుకోండి ఓటు అనే హక్కుతో కులం చూసి, మతాన్ని చూసి కాదు మనిషి గుణం చూసి వాడు చేసిన అభివృద్ధిని చూసి మన రాత మారుస్తాడని నమ్మకం ఉన్నవాడికి వెయ్యండి మీ ఓటు. వేయండి అని అన్నారు.
 
NTR,allu arjun, sai tej
NTR,allu arjun, sai tej
ఎన్.టి.ఆర్. కూడా నేడు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా దర్శకుడు సుకుమార్, తన భార్య తబిత బాండ్రెడ్డితో ఓటు వినియోగించుకుని ఇలా ప్రదర్శించారు.
 
అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యొక్క అందమైన సంజ్ఞ అందరి హృదయాలను గెలుచుకుంది.
తెలంగాణా రాష్ట్రంలో ఈ రోజు జరుగుతున్న ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు ని విధిగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశాడు.
 
సాయి తేజ్... ఓటు వేసిన తర్వాత  నా రాష్ట్రం మరియు నా దేశం కోసం నా 'సరైన' బాధ్యతను నిర్వర్తించాను...మీరు ఓటు వేసారా  అని తెలిపారు.