మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 23 జనవరి 2023 (10:02 IST)

బాలకృష్ణ కొత్త చిత్రం బ్యాక్‌డ్రాప్‌ చెప్పేశాడు

Balakrishna
Balakrishna
వీరసింహారెడ్డి తర్వాత నందమూరి బాలకృష్ణ ఏ సినిమా చేస్తున్నాడనేది అందరికీ తెలిసిందే. ఎన్‌బి.కె.108వ చిత్రంగా దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోంది. ముందుగానే ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు. నిన్న రాత్రి హైదరాబాద్‌లో జరిగిన వీరి సింహారెడ్డి సక్సెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడారు.
 
బాలయ్యబాబు తెలంగాణ మాండలికంలో డైలాగ్‌లు చెబితే ఎలా వుంటుందనేది మా సినిమా చెప్పబోతోంది. బాలయ్యబాబు పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా వుంటుంది. తండ్రి, కూతురు సెంటిమెంట్‌తో ఎమోషనల్‌గా అందరికీ కట్టిపడేస్తుంది. దానికితోడు బాలయ్యబాబు సినిమాల్లో ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ కీలకం. ఇంతవరకూ రాని పాయింట్‌తో గ్రాండ్‌ వుంటుందని అన్నారు. మొత్తానికి బాలయ్యబాబు పాత్ర రిలీవ్‌ చేయకుండానే చేసినట్లయింది.