1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 21 అక్టోబరు 2022 (22:34 IST)

సంక్రాంతికి బాల‌కృష్ణ వీరసింహారెడ్డి రాబోతుంది (video)

Veerasimha Reddy
Veerasimha Reddy
నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ  #NBK107 కి పవర్ ఫుల్ టైటిల్ ఖరారైయింది. మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'వీరసింహారెడ్డి' టైటిల్ ని ఖరారు చేశారు. టైటిల్‌ను వేలాది మంది అభిమానుల సమక్షంలో భారీగా లాంచ్ చేశారు. కర్నూలు కొండా రెడ్డి బురుజుపై 3డి టైటిల్ పోస్టర్‌ ను లాంచ్ చేశారు మేకర్స్.
 
మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'వీరసింహారెడ్డి' యాప్ట్ టైటిల్. 'సింహా'పేరుతొ  బాలకృష్ణ చేసిన మెజారిటీ సినిమాలు భారీ బ్లాక్‌ బస్టర్‌ లుగా నిలిచాయి. టైటిల్ పోస్టర్ కూడా చాలా ఇంపాక్ట్ ఫుల్ గ వుంది.  టైటిల్ పోస్టర్ బాలకృష్ణ ఫెరోషియస్ గా కనిపించారు. పోస్టర్ పై  గర్జించే సింహం బాలకృష్ణ క్యారెక్టర్ ని ప్రతిబింబిస్తుంది.
 
టైటిల్ పోస్టర్  బాలకృష్ణ ప్రత్యేకంగా రూపొందించిన ఆయుధంతో వేటకు సిద్ధమైన సింహాలా కనిపిస్తున్నారు. పులిచెర్ల 4 కిలోమీటర్ల మైల్ స్టోన్ కనిపిస్తోంది.  టైటిల్ పోస్టర్  సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పింది. ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో పాటు ఫస్ట్‌ హంట్‌కి  భారీ స్పందన  వచ్చింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు టైటిల్ పోస్టర్ ద్వారా వెల్లడించారు నిర్మాతలు.
 
టైటిల్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. బాలకృష్ణ అభిమానిగా, ఆయన సమర సింహారెడ్డి చూసిన అభిమానిగా, సమర సింహారెడ్డి ఫస్ట్ డే చూసి రోజంతా జైల్లో వున్న అభిమానిగా తీసిన సినిమా వీరసింహారెడ్డి. ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకునేలా వుంటుంది. సమరసింహా రెడ్డి ఎలాంటి వైబ్రేషన్ ఇచ్చిందో అలాంటి వైబ్రేషన్ వీరసింహా రెడ్డి ఇస్తుంది. అభిమానులు ఊహించినదాని కంటే రెండింతలు ఎక్కువ వుంటుంది. సంక్రాంతి మన వీరసింహారెడ్డి విజ్రుభించబోతున్నాడు. బాలకృష్ణ గారిని డైరెక్ట చేయడం నా అదృష్టం. థియేటర్లో మోత మాములుగా వుండదు. ఫ్యాన్స్ లానే నేను కూడా థియేటర్ లో చూడాలని ఎదురుచూస్తున్నా. సినిమా షూటింగ్ ఇంకా ఇరవై రోజులు వుంది. కానీ ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. అంత స్టఫ్ వుంది ఈ సినిమాలో. ''వీరసింహా రెడ్డి పుట్టింది  పులిచర్ల చదివింది అనంతపురం.. రూలింగ్ కర్నూల్' ఇలాంటి చాలా డైలాగులు వున్నాయి సినిమాలో. మైత్రీ మూవీ మేకర్స్ నా కలని సాకారం చేస్తూ ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని నిర్మించారు. సాయి మాధవ్ బుర్రా గారి డైలాగుల్లో వీరసింహారెడ్డి విశ్వరూపం చూస్తారు. తమన్ మ్యూజిక్ మాములుగా వుండదు. సాంగ్స్ డ్యాన్స్ లు అదిరిపోతాయి. మన బాలయ్యని ఎలా చూడాలని అనుకుంటామో అలా వుంటుంది సినిమా. సంక్రాంతికి వస్తున్నాం'' అన్నారు.
 
నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ,.. మంచి రోజు మంచి విషయం చెప్పాలని మంచి ప్లేస్ కర్నూల్ కొండా రెడ్డి బురుజు వద్ద టైటిల్ లాంచ్ చేస్తున్నాం. ఈ సినిమా సమరసింహా రెడ్డి రోజుల్లోకి తీసుకెళుతుంది. మంచి పాటలు, ఫైట్లు, డ్యాన్సులు, డైలాగులు ఇలా అన్నీ ఎలిమెంట్స్ వున్న సినిమా ఇది. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు'' అని చెప్పారు.
 
సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ.. గన్ షాట్ గా చెబుతున్నాను. సూపర్ డూపర్ హిట్ కొడుతున్నాం. ప్రేక్షకులకు, అభిమానులు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి. తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకోబోతున్నాం. ఈ సినిమాని రాసే అవకాశం ఇచ్చిన బాలకృష్ణ గారికి,  గోపీచంద్ మలినేని గారికి , నిర్మాతలకు కృతజ్ఞతలు. జై బాలయ్య'' అని చెప్పారు.
 
 శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలకృష్ణ ,గోపీచంద్ మలినేని చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌లను అందించిన సంగీత సంచలనం ఎస్ థమన్ NBK107కి  సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.
 
 మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.  స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.
 
 నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, చంద్రిక రవి (స్పెషల్ నంబర్) తదితరులు.
 
 సాంకేతిక విభాగం
కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: థమన్, డివోపీ: రిషి పంజాబీ, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కెవివి, పీఆర్వో: వంశీ-శేఖర్