ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 అక్టోబరు 2020 (15:25 IST)

అద్ధంలో చూసుకుని ఏడ్చాను.. నాజూగ్గా మారిన అవికా గోర్

Avika Gor
చిన్నారి పెళ్ళి కూతురు సీరియల్‌తో బాగా పాపులర్ అయిన అవికా గోర్ ఇంతకముందు చాలా బొద్దుగా, ముద్దుగా ఉండేది. ఇప్పుడు నాజుగ్గా మారిన ఫోటోలని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ అనుభవాలని వివరించింది. గత ఏడాది ఓ సారి అద్ధంలో చూసుకోగా, నన్ను నేను చూసి చాలా ఏడ్చాను. నా శరీరాకృతి ఏ మాత్రం నచ్చలేదు. శరీరానికి గౌరవం ఇవ్వనందునే ఇంత లావుగా అయ్యాయని ఫీలయ్యాను. చాలా మదన చెందాను. ఆ ఆలోచనలతో నాకు మనశ్శాంతి కూడా లేకుండా పోయింది.
 
దీంతో మంచి డైట్‌, వర్కవుట్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాను. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ నేను ఆగలేదు. నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా సాయం చేశారు. ఇప్పుడు తిరిగి అద్దంలో చూసుకొని చాలా సంతోషించాను అంటూ.. అవికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది.
 
కాగా.. ఉయ్యాల జంపాల అనే సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, తను నేను, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి చిత్రాలలో నటించింది. చివరిగా 2019లో రాజు గారి గది 3 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తర్వాత అవికా కొంత గ్యాప్ తీసుకోగా, ఈ గ్యాప్‌లో సరికొత్త లుక్‌లోకి మారి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.