మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 మే 2023 (17:06 IST)

రోడ్డు ప్రమాదంలో బెంగాల్ టీవీ నటి సుచంద్ర మృతి.. బైకులో వెళ్తూ..

Suchandra
Suchandra
ప్రముఖ బెంగాల్ టీవీ నటి సుచంద్ర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. షూటింగ్ ముగించుకుని ఇంటికి చేరుకునే క్రమంలో యాప్ ద్వారా బైకును బుక్ చేసుకుంది. బైకుపై ప్రయాణిస్తుండగా.. సుచంద్ర ప్రయాణిస్తున్న బైకు అదుపు తప్పింది. సైక్లిస్ట్ అడ్డురావడంతో సడన్ బ్రేక్ వేసి బైక్ రైడర్.. పది చక్రాల ట్రక్కును ఢీకొన్నాడు. 
 
ఈ ఘటనపై బైకు వెనుక కూర్చున్న నటి కిందపడిపోయింది. దీంతో తీవ్రగాయాల పాలైన సుచంద్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సుచంద్ర హెల్మెట్ ధరించినా ఫలితం లేకపోయింది. 
 
సుచంద్ర దాస్‌గుప్తా అనేక ప్రముఖ బెంగాలీ టీవీ షోలలో కనిపించింది. గౌరీ షోలో సపోర్టింగ్ రోల్ పోషించి పాపులర్ అయ్యింది. ఈ ఘటన ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరానగర్‌లో జరిగింది