సోమవారం, 14 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 22 మే 2023 (13:05 IST)

మిలిటరీ హోటల్‌లో వెయిటర్‌గా మారిన 'బిచ్చగాడు' హీరో

vijay antony
"బిచ్చగాడు" చిత్రంలో తన పాత్రతో పేరు తెచ్చుకున్న నటుడు విజయ్ ఆంటోని. ఇపుడు ఓ హోటల‌లో వెయిటర్‌గా మారిపోయాడు. హైదరాబాద్‌ నగరంలోని మణికొండలో 1980 మిలిటరీ హోటల్‌లో వెయిటర్‌గా మారి కస్టమర్లను ఆశ్చర్యపరిచాడు. విజయ్ ఆంటోనీ, అతని బృందం హోటల్‌లోకి ప్రవేశించిన వీడియో వైరల్‌గా మారింది. వారు సర్వర్ దుస్తులు ధరించి కస్టమర్లు అడిగిన ఆహార పదార్థాలను ఆర్డర్ తీసుకుని వారికి తిరిగి సరఫరా చేస్తున్నారు. 
 
విజయ్ ఆంటోనీ వ్యక్తిగతంగా బిర్యానీ వంటి వంటకాలు మరియు ఇతర ఆహార పదార్థాలను వారి టేబుల్‌ల వద్దకు సరఫరా చేసి ఆశ్చర్యపరిచారు. వెయిటర్ పాత్రలో విజయ్‌ని చూసి కస్టమర్‌లు ఆశ్చర్యపోయారు. తమ మొబైల్ కెమెరాలలో చిరస్మరణీయ క్షణాలను ఆసక్తిగా బంధించారు. ఈ హోటల్ విజిటింగ్ తర్వాత 1980 మిలిటరీ హోటల్‌లోని బృందం విజయ్ ఆంటోనీకి తమ కృతజ్ఞతలు తెలుపుతూ, "మమ్మల్ని సందర్శించినందుకు #Bichagadu2 టీమ్‌కి ధన్యవాదాలు! మీకు ఆతిథ్యం ఇచ్చినందుకు మాకు గౌరవం @vijayantony" అని ట్వీట్ చేశారు.