శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 జూన్ 2023 (12:32 IST)

భగవత్ కేసరి టీజర్.. తెలంగాణ యాసలో డైలాగ్స్ అదుర్స్ (వీడియో)

balakrishna
బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని నందమూరి ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్ వచ్చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భగవత్ కేసరి సినిమా నుంచి టీజర్ వచ్చేసింది. 
 
సాహు గారపాటి - హరీశ్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలోని టీజర్‌లో అడవి బిడ్డా.. నేలకొండ భగవంత్ కేసరి.. అంటూ తన గురించి చెప్పుకునే డైలాగ్ అదిరింది. ఇందులో తెలంగాణ యాసలో డైలాగ్స్ అదరగొట్టారు బాలయ్య. 
 
బాలకృష్ణ సరసన నాయికగా కాజల్ కనిపించనుంది. ఇక ఆయన కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తోంది. కథ అంతా కూడా తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో కొనసాగనుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను 'దసరా'కి విడుదల చేయనున్నారు.