శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 26 మార్చి 2018 (12:30 IST)

చిట్టిబాబు రికార్డును బ్రేక్ చేసిన భరత్... తొలి సింగిల్‌కు 2 గంటల్లోనే 10లక్షల వ్యూస్..

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం ''భరత్ అనే నేను''. ఈ సినిమా తొలి పాట ఆదివారం విడుదలైంది. తద్వారా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గత వారంలో సృష్టించిన రికార్డులను మహేష్ బాబు ''భరత్ అనే నేను'' బ్రేక

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం ''భరత్ అనే నేను''. ఈ సినిమా తొలి పాట ఆదివారం విడుదలైంది. తద్వారా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గత వారంలో సృష్టించిన రికార్డులను మహేష్ బాబు ''భరత్ అనే నేను'' బ్రేక్ చేసింది. భరత్ అనే నేను సినిమాలోని దిస్ ఈజ్ మీ అనే తొలి పాట విడుదలైన రెండు గంటల వ్యవధిలోనే 10 లక్షల మంది యూ ట్యూబ్‌లో చూశారు. ఫలితంగా రామ్ చరణ్ 'రంగస్థలం' తొలి సాంగ్ రికార్డు చెరిగిపోయింది. 
 
'ఎంత సంక్కగున్నావే' అంటూ విడుదలైన పాట మూడు గంటల సమయంలో ఈ రికార్డును అందుకుంది. ఆ తరువాత అల్లు అర్జున్ 'నా పేరు శివ' తొలి పాట విడుదల తరువాత 7 గంటల వ్యవధిలో ఈ రికార్డును అందుకుంది. అంతకన్నా ముందు పవన్ కల్యాణ్ సినిమా 'అజ్ఞాతవాసి'లోని బయటికొచ్చి చూస్తే సాంగ్ 8 గంటల వ్యవధిలో 10 లక్షల వ్యూస్ సాధించింది. వీటన్నింటితో పోలిస్తే, మహేష్ సాంగ్ కేవలం రెండు గంటల్లోనే 10 లక్షల మందిని ఆకర్షించడంతో ప్రిన్స్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు.
 
కాగా మహేష్ బాబు-కొరటాల శివ కలిసి ''భరత్ అనే నేను'' కోసం పనిచేస్తున్నారు. ఏప్రిల్ 20న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత కొరటాల కాంబినేషన్‌లో మూవీ కావడంతో పాటు ఇందులో మహేష్ ముఖ్యమంత్రిగా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే మార్చి 6న ''భరత్ విజన్'' పేరుతో విడుదలైన టీజర్ 14,408,772 వ్యూస్ సాధించింది. తాజాగా తొలి సింగిల్స్ సాంగ్ రెండు గంటల్లోనే పది లక్షల మంది వ్యూస్‌తో రికార్డు సృష్టించింది.