శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: మంగళవారం, 21 ఆగస్టు 2018 (22:20 IST)

బిగ్ బాస్‌లో నాని వివాదాస్పద నిర్ణయం.. ఏంటది?

ఆరోగ్యానికి హానికరమైన ధూమపానం, మద్యపానాన్ని నిరుత్సాహపరచడానికి ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ప్రకటనల ద్వారా ప్రజల్లో చైతన్యం తెస్తున్నాయి. థియేటర్లలో సినిమా ప్రారంభిమానికి ముందుగా, ఇంటర్వెల్‌లో కచ్చితంగా ఇటువంటి చైతన్యానికి సంబంధించిన ప్రక

ఆరోగ్యానికి హానికరమైన ధూమపానం, మద్యపానాన్ని నిరుత్సాహపరచడానికి ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ప్రకటనల ద్వారా ప్రజల్లో చైతన్యం తెస్తున్నాయి. థియేటర్లలో సినిమా ప్రారంభిమానికి ముందుగా, ఇంటర్వెల్‌లో కచ్చితంగా ఇటువంటి చైతన్యానికి సంబంధించిన ప్రకటనలు వేస్తున్నారు. ఇక సినిమాలు, టివి సీరియళ్లలో ఎక్కడా మద్యం సేవించే దృశ్యాలు, సిగరెట్లు తాగే సన్నివేశాలు వుంటే… కింద ‘మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అని హెచ్చరిస్తూ టైటిల్స్‌ వేస్తున్నారు. బిగ్‌బాస్‌ షోలోనూ ఎవరైనా సిగరెట్‌ తాగుతుంటే… టైటిల్స్‌ వేస్తున్నారు.
 
అయితే… సోమవారం నాటి ఎపిసోడ్‌లో ప్రసారమైన ఓ దృశ్యం సిగరెట్‌ తాగడాన్ని ప్రోత్సహించేలా వుంది. తనిష్‌ సిగరెట్‌ తాగడానికి వెళుతుంటారు. పూజా రామచంద్రన్‌ అతనితో… ఒక సిగరెట్‌ తాగడం వల్ల ఐదు నిమిషాల ఆయుష్షు తగ్గిపోతుందని చెబుతుంది. ఆవిధంగా రోజుకు 12 సిగరెట్లు తాగితే…. 60 నిమిషాల ఆయుష్షు తగ్గిపోయినట్లేనని లెక్కేస్తారు. ఇలా ఏవోవో లెక్కలు వేసి…. సిగరెట్‌ తాగడం వల్ల జీవిత కాలంలో సంవత్సరం మేరకు ఆయువు తగ్గిపోతుందని లెక్కేస్తారు. ఇక్కడ దాకా ఆపేసి, మిగతాది ఎడిట్‌ చేసి వుంటే… ఒకరకంగా ఇది చైతన్యం కలిగించేదిగా ఉండేది. కానీ…. తనిష్‌ దీనిపైన స్పందించిన తీరునూ ప్రసారం చేశారు. 
 
సిగరెట్‌ తాగడం వల్ల నాకు తగ్గిపోయేది ఒక సంవత్సరమే కదా…. రెండేళ్లు పోయినా ఫర్వాలేదు… నేను 98 బతికినా చాలు…. అంటూ వెళతారు. దీనిర్థం ఏమిటి? సిగరెట్లు తాగమని ప్రోత్సహించడమా? బిగ్‌బాస్‌ ఎడిటర్లకు తాము ప్రసారం చేస్తున్నది తప్పు అనే స్పృహ వుందో లేదోనన్న సందేహం కలుగుతుంది? తాము తనిష్‌ మాటలను యధాతథంగా ప్రసారం చేస్తే ఎటువంటి మెసేజ్‌ జనంలోకి వెళుతుంది… అనేది ఆలోచిస్తున్నారా? ఒక సినీ నటుడే…. స్వయంగా సిగరెట్‌ తాగడం వల్ల కొంపలు మునిగిపోయేది ఏమీ లేదన్నట్లు రియాల్టీ షోలో మాట్లాడితే…. దాన్ని యధాతథంగా ప్రసారం చేస్తారా? ఇటువంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత బిగ్‌బాస్‌ షో నిర్వాహకులపై ఉంది.