సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 18 ఆగస్టు 2017 (19:43 IST)

బిగ్ బాస్ రచ్చ.. నువ్వదేసుకుని రా... దీక్షతో ధనరాజ్, నేనేమేసుకుంటే నీకెందుకు?

బిగ్ బాస్ తెలుగు మెల్లమెల్లగా హీట్ పెంచుతోంది. ఇవాల్టి ఎపిసోడ్‌లో ఏదో సీరియస్ మేటర్ జరుగుతున్నట్లు ప్రచారం చేస్తోంది బిగ్ మాస్ స్టార్ మా. ఇందులో ఏవుందయా అంటే... బిగ్ బాస్ పార్టిసిపెంట్స్‌కి కోడిగుడ్ల టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ఎవరు పూర్తి చేస్తే వారే వ

బిగ్ బాస్ తెలుగు మెల్లమెల్లగా హీట్ పెంచుతోంది. ఇవాల్టి ఎపిసోడ్‌లో ఏదో సీరియస్ మేటర్ జరుగుతున్నట్లు ప్రచారం చేస్తోంది బిగ్ మాస్ స్టార్ మా. ఇందులో ఏవుందయా అంటే... బిగ్ బాస్ పార్టిసిపెంట్స్‌కి కోడిగుడ్ల టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ఎవరు పూర్తి చేస్తే వారే విన్నర్. ఇందుకోసం అంతా అటూఇటూ పరుగులు లంకించుకున్నారు. 
 
ఈ గందరగోళంలో గ్లాసు పగిలి ముక్కలయింది. పగిలిన ఆ గ్లాసు ముక్క అర్చన కాలికి కోసుకుని రక్తం వస్తోంది. మరోవైపు దీక్షాపంత్ కింద పడిపోయింది. ఇంకోవైపు ధనరాజ్.. పెద్దగా అరుస్తూ నువ్వు జీన్స్ వేసుకురా అని అన్నాడు. నేను ఏమేసుకుంటే నీకెందుకు అని దీక్ష బదులిచ్చింది. ఇంకోవైపు ముమైత్ ఖాన్-శివబాలాజీ పోట్లాడుకుంటున్నారు. ఇలావుంది వ్యవహారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.