మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసిన బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్
బిగ్ బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లీగంజ్ శనివారం నాడు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిశారు. మాసాబ్ ట్యాంక్ లోని మంత్రి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా ఆయనను కలిసి బిగ్ బాస్ టైటిల్ విన్నింగ్ గురించి కొద్దిసేపు ముచ్చటించారు.
ఇటీవల జరిగిన బిగ్ బాస్ 3 తెలుగు సీజన్లో ఉత్కంఠభరితంగా సాగిన గ్రాండ్ ఫినాలెలో రాహుల్ విజేతగా నిలిచాడు. మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా బిగ్ బాస్ ట్రోఫీని, రూ. 50 లక్షల చెక్కును అందుకున్నాడు.