సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By preethi
Last Updated : బుధవారం, 19 సెప్టెంబరు 2018 (11:53 IST)

ప్లేటు ఫిరాయించిన అమిత్.. కౌషల్ ఆర్మీ ఎఫెక్టా

బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే దగ్గర పడుతున్న కొద్దీ విన్నర్ ఎవరనే ఆతృత, ఊహాగానాలు అందరిలో ఎక్కువయ్యాయి. ఇప్పటికే చాలామంది నోట కౌషల్ విన్నర్ అవుతారనే మాట వినిపిస్తుండగా, గీతకు కూడా అదే స్థాయిలో విన్నింగ్

బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే దగ్గర పడుతున్న కొద్దీ విన్నర్ ఎవరనే ఆతృత, ఊహాగానాలు అందరిలో ఎక్కువయ్యాయి. ఇప్పటికే చాలామంది నోట కౌషల్ విన్నర్ అవుతారనే మాట వినిపిస్తుండగా, గీతకు కూడా అదే స్థాయిలో విన్నింగ్ ఛాన్స్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. బిగ్ బాస్ హౌస్ నుండి తాజాగా ఎలిమినేట్ అయ్యిన అమిత్ తివారీ ఆ సమయంలో స్టేజీ మీద నాని అడిగినప్పుడు టాప్ త్రీ కంటెస్టెంట్స్‌గా సామ్రాట్, గీతా, రోల్ రైడా పేర్లు చెప్పారు.
 
అంతేకాకుండా కౌశల్ కన్నింగ్ అంటూ సంచలన కామెంట్స్ చేసారు. ఇక తాజాగా ఒక ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ విన్నర్ అయ్యే ఛాన్స్ కౌషల్‌కు ఎక్కువగా ఉందని ప్లేటు ఫిరాయించారు. అంతేకాకుండా నిజం చెప్పాలంటే కౌశల్ బిగ్ బాస్ గేమ్‌ని చాలా బాగా ఆడుతున్నారు కాబట్టే ఆయనకు బయట అంతమంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. 
 
ఆయన ఫైనల్‌కి వెళ్ళడం పక్కా. ఇక విన్నర్ కూడా అవుతారు. ఆయన తర్వాత చూస్తే రెండో స్థానంలో గీతా మాధురి కూడా విన్ అయ్యే అవకాశాలున్నాయి. కౌశల్‌లో ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అది ఆయన ఎప్పుడూ గేమ్ మీదే ఫోకస్ పెడతారు. అన్ని రోజులపాటు హౌస్‌లో ఎవరితో కలవకుండా ఉంటున్నారంటే చాలా గ్రేట్. దాన్ని ఒంటిరి తనం అనలేం.. గేమ్‌పై ఫోకస్ అనాలి. అలా అందరూ ఉండలేరు.
 
నేనైతే అలా అస్సలు ఉండలేను, ఏవో కోతి పనులు చేస్తుంటాను అని అన్నారు. బయటకు వచ్చాక ప్రేక్షకుల్లో కౌశల్‌కి ఉన్న ఫాలోయింగ్ చూసి తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లున్నారు అమిత్. టాప్ త్రీగా సామ్రాట్, గీతా, రోల్ రైడా పేర్లు చెప్పింది వాళ్ల మీద ఇష్టంతో మాత్రమే అని అన్నారు.