శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (14:58 IST)

ఉమాదేవి అండ్ లోబో రెచ్చిపోయారుగా.. బిగ్ బాస్ ఐదో సీజన్.. 12 ఎపిసోడ్ హైలైట్స్

Lobo_uma
బిగ్ బాస్ హాస్‌లో లవ్ ట్రాక్స్ చూడటం అనేది ఆడియన్స్‌కి కొత్తేమీ కాదు. అయితే, ఈసారి ఎలాంటి లవ్ ట్రాక్ చూడాలా అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇంతలో మేమున్నాం అంటూ ఉమాదేవి అండ్ లోబో ఇద్దరూ రెచ్చిపోయారు. హౌస్‌లో క్యూట్ క్యూట్‌గా మాట్లాడుతూ కామెడీ చేశారు. 
 
ఇక వీళ్లని చూసిన హౌస్ మేట్స్ అందరూ కూడా జోక్స్‌పై జోక్స్ వేస్తూ నవ్వుకున్నారు. ఇంతలో ఈ లవ్ స్టోరీ బిగ్ బాస్ కంట్లో కూడా పడింది. ఇక ఊరుకుంటాడా.. వెంటనే వీళ్లకి ఒక స్కిట్ చేయండి. సింగిల్ బెడ్ గెలుచుకోండి అంటూ టాస్క్ ఇచ్చాడు.
 
ఇక టాస్క్ లో భాగంగా ఆటో డ్రైవర్ అవతారమెత్తిన లోబో పాసింజర్ గా పారిస్ నుంచి వచ్చిన ప్రియాంకని ఎక్కించుకుని హైదరాబాద్ గల్లీల్లో తిప్పాడు. ఇక్కడ ప్రియాంక వేసిన పంచ్ లకి ఇరిటేట్ అయిన లోబో స్కిట్ అక్కడున్న ప్రేక్షకులైన హౌస్ మేట్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. 
 
ఆ తర్వాత అత్తాకోడళ్లుగా ఉమా సిరి ఒక స్కిట్ చేశారు. అబ్బనీ తీయనీ దెబ్బ అంటూ అత్తగా ఉమాదేవి జాబ్ చేసి వచ్చి అలసిపోయిన కోడలిగా సిరిలు స్కిట్ లో అలరించారు. ఇక్కడే ఉమాదేవి తనదైన స్టైల్లో రెచ్చిపోయింది.
 
రియాలిటీకి - ఊహకి ఉన్న తేడాని క్లియర్ గా చూపించింది ఈ అత్త. ఈ రెండు స్కిట్స్ చేసిన తర్వాత హౌస్ మేట్స్ లో మెజారిటీ ఓట్లు లోబోకి పడ్డాయి దీంతో సింగిల్ బెడ్ విజేత లోబో అయ్యాడు. ఇక్కడే ట్విస్ట్ ఇచ్చాడు లోబో ఈ బెడ్ ని ఉమాదేవికి ఇచ్చేస్తున్నాను అంటూ మాట్లాడాడు. కానీ ఉమాదేవి సున్నితంగా తిరస్కరించింది. ఇక లోబో బెడ్ లాక్ ని తీసి దానిపై పడుకుని ఆనందించాడు. 
 
అలాగే బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్-5 విజయవంతంగా 12 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 12వ ఎపిసోడ్ ఎనర్జిటీక్‌గా ఇంటి సభ్యులంతా కూల్ మైండ్‌తో నవ్వులు పూయించారు. తొలుత రెండు టీంలకు అగ్గిపుల్లలు ఇచ్చి ఇసుకలో వరుసగా గుచ్చి వెలిగించాలని చివరి వరకూ పుల్లలు ఆరిపోకుండా ఎవరివైతే వెలుగుతాయో ఆ టీం గెలిచినట్టు అని చెప్పారు. 
 
ఈ టాస్క్‌లో ఎల్లో టీంపై బ్లూ టీం గెలిచింది. ఇక పంతం నీదా నాదా టాస్క్‌లో ఈగల్ ( బ్లూ) టీం దగ్గర ఎక్కువ ఫ్లాగ్స్ ఉండటంతో విజేతలుగా నిలిచారు. అనంతరం శ్వేతా బర్త్ డే కావడంతో హమీదా, కాజల్‌లు కేట్ కట్ చేయించి సెలబ్రేట్ చేసుకున్నారు.
 
ఇక అర్ధరాత్రి మానస్- లహరి రొమాన్స్‌ చేస్తూ రచ్చ రచ్చ చేశారు. వీరిని కిచెన్ నుండి శ్రీరామ్, సిరి, ప్రియ అండ్ బ్యాచ్ చూస్తూనే ఉన్నారు. తర్వాత వీరిద్దరి దగ్గరికి వచ్చిన శ్రీరామ్‌ రాగా ఆయనకు మరింత కోపం వచ్చేలా మానస్.. ఏంటి లహరి పడుకుంటున్నావా? అని అడిగి.. ఓకే గుడ్ నైట్ అని దగ్గరకు తీసుకుని హగ్ ఇచ్చాడు. అది చూసి శ్రీరామ్ పక్కకి వెళ్లిపోయాడు. ఆ తరువాత లహరి నా బెడ్ వరకూ రా అని మానస్‌ని పిలిచింది. మానస్ ఆమె వెనుకే వెళ్లడంతో మైక్ తీసేసిన లహరి.. మానస్‌ని గట్టిగా కౌగిలించుకుంది. తర్వాత రోజు ఉదయం లహరి- మానస్‌లు రొమాంటిక్‌గా మాట్లాడుకుంటూ కనిపించారు.
 
పంతం నీదా నాదా టాస్క్‌లో శ్రీరామ్ టీం గెలవడంతో.. ఆ టీంలో బెస్ట్ పెర్ఫామర్స్‌ని ఎంపిక చేయాల్సిందిగా టీం కెప్టెన్ శ్రీరామ్‌ని అడిగారు బిగ్ బాస్. అయితే ప్రియని ఎంపిక చేసే అవకాశం లేదని చెప్పారు. దీంతో ఇది అన్యాయం బిగ్ బాస్ అని అనేసింది ప్రియ. తర్వాత అంతా చర్చించుకుని ఆనీ మాస్టర్, విశ్వ, హమీదా, ప్రియాంకలను ఎంపిక చేశారు.
 
అయితే ఈ నలుగురికి కొడితే కొట్టాలిరా కొబ్బరికాయ కొట్టాలి అనే టాస్క్ ఇచ్చారు. కొన్ని కొబ్బరి కాయలు ఇచ్చి ఇంటి సభ్యులు ఆ కొబ్బరి కాయల్ని కొట్టి.. ఎవరైతే కెప్టెన్ పోటీ దారులుగా ఉన్నారో వాళ్లకి ఎదురుగా ఉన్న బౌల్స్‌ని నింపాలని ఎవరి బౌల్ ముందు నిండితే వాళ్లే కెప్టెన్ అవుతారని చెప్పారు. రవి, జెస్సీ, శ్రీరామ్ తదితరులు విశ్వకి సపోర్ట్ చేయడంతో విశ్వ రెండోవారంలో హౌస్‌కి కెప్టెన్ అయ్యాడు.