శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 జనవరి 2025 (20:03 IST)

మైన‌ర్ బాలిక‌పై లైంగిక దాడి- గర్భం దాల్చింది.. ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్లు జైలు

Bhargav
Bhargav
మైన‌ర్ బాలిక‌పై లైంగిక దాడికి పాల్పడిన కేసులో తెలుగు యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌కు కోర్టు 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది. విశాఖ జిల్లా పోక్సో కోర్టు భార్గవ్‌కి 20 ఏళ్ల క‌ఠిన కారాగార శిక్షతో పాటు బాధిత బాలిక‌కు రూ.4 ల‌క్ష‌ల ప‌రిహారం ఇవ్వాలంటూ తీర్పునిచ్చింది. ఈ కేసులో మొత్తం 25మంది సాక్షులను పోలీసులు విచారించగా కోర్టుకు 17మంది సాక్ష్యం చెప్పారు.
 
ఇక ఒకప్పుడు టిక్‌టాక్‌లో కామెడీ వీడియోలు చేస్తూ ఫుల్ ఫేమస్ అయ్యాడు భార్గవ్. ఆ తర్వాత ఫ‌న్ బ‌కెట్ అంటూ యూట్యూబ్‌‌లో పలు ఫ‌న్ వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. 
 
కాగా, వీడియోలు తీసే నెపంతో 14 ఏళ్ళ బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దాంతో ఆ బాలిక ప్రెగ్నెంట్ అయింది. ఇదే ఈ విష‌యంపై బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించగా.. ఈ కేసుపై పోలీసులు విచారణ చేపట్టారు. అలా భార్గవ్‌పై దిశ చ‌ట్టంతో పాటు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.