శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 జూన్ 2020 (11:03 IST)

కరోనా దెబ్బకు బాలీవుడ్ సంగీత దర్శకుడు కన్నుమూత

కరోనా వైరస్ కాటుకు మరో సంగీత దర్శకుడు తుదిశ్వాస విడిచారు. ఈయన కొద్ది రోజుల క్రితం కిడ్నీ మార్పిడి చేయించుకోగా, ఆయనకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన పేరు వాజీద్ ఖాన్. వయస్సు 42 యేళ్లు. ఈయన సంగీత దర్శకుడు మాత్రమేకాదు గాయకుడు కూడా. ఈయన గత రాత్రి కన్నుమూశారు. 
 
నెల రోజుల క్రితమే ఆయన కిడ్నీ మార్పిడి చేసుకోగా, కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ సంక్రమించింది. బాలీవుడ్‌కు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించిన వాజిద్ లాక్‌డౌన్ సమయంలో నటుడు సల్మాన్ ఖాన్ ‘భాయ్ భాయ్’ పాటకు సంగీతం అందించారు.
 
వాజిద్ మృతి వార్త తెలిసిన వెంటనే బాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాతం తెలిపారు. వాజీద్ మరాణాన్ని నమ్మలేకున్నానని, ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని సింగర్ హర్షదీప్ పేర్కొన్నారు. 
 
వాజీద్ ఖాన్ నవ్వు తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు. వాజీద్ మరణవార్త తనను షాక్‌కు గురిచేసిందని బాలీవుడ్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన సింగర్ బాబుల్ సుప్రియో అన్నారు.