ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 మే 2020 (09:26 IST)

గాలిలేని గదుల్లో వుంటున్నారా? కరోనాతో ముప్పు..!

గాలిలేని గదుల్లో వుంటున్నారా? అయితే కరోనాతో ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గాలి ప్రసరణ సరిగా లేని ఇళ్లు, కార్యాలయాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి ముప్పు అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు.

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 విజృంభణ నేపథ్యంలో ఈ విషయంపై తక్షణం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన యూకేలోని సర్రే యూనివర్సిటీ పరిశోధకుడు ప్రశాంత్‌ కుమార్‌ వెల్లడించారు. 
 
అంతేగాకుండా.. ఈ వివరాలను ఎన్విరాన్‌మెంటల్‌ ఇంటరాక్షన్‌ జర్నల్‌లో ప్రచురించారు. మనుషుల నిశ్వాస, తుమ్ము, దగ్గుల ద్వారా బయటకు వెలువడే సూక్ష్మ బిందువుల్లో నుంచి నీరు క్రమంగా ఆవిరైపోతుందని, వైరస్‌ కణాలు మాత్రం ఆ పరిసరాల్లోనే ఉండిపోతాయన్నారు. 
 
అన్ని ప్రాంగణాల్లో ఇప్పుడు ఏసీలు ఉంటున్నప్పటికీ.. వాటి పనితీరు సమర్థంగా లేకపోతే ప్రమాదం పొంచి ఉన్నట్టేనని హెచ్చరించారు. అందుచేత గదులలో గాలి వెలుతురు ధారాళంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గాలి ప్రసరణ ద్వారా వైరస్ కణాలను తొలగించుకోవచ్చునని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.