శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 13 ఆగస్టు 2018 (15:02 IST)

హాస్యనటుడి చిత్రానికి 115 మంది నిర్మాతలు.... ఎలా?

టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం. ఈయన తనయుడు గౌతమ్. ఆయన్ను వెండితెరకు పరిచయం చేస్తూ తీస్తున్న చిత్రం "మను". ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నారు. అయితే, ఈ చిత్రానికి ఏకంగా 115 మంది

టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం. ఈయన తనయుడు గౌతమ్. ఆయన్ను వెండితెరకు పరిచయం చేస్తూ తీస్తున్న చిత్రం "మను". ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నారు. అయితే, ఈ చిత్రానికి ఏకంగా 115 మంది నిర్మాతలు. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే అంశమే. గౌతమ్ సరసన చాందిని హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా ఫణీంద్ర అనే వ్యక్తి దర్శకుడిగా తొలిసారి పరిచయమవుతున్నాడు.
 
తాజాగా ఆయన మాట్లాడుతూ, 'ఈ కథను నమ్మిన వాళ్లంతా తమకి తోచిన స్థాయిలో పెట్టుబడి పెట్టారు. వాళ్ల నమ్మకానికి ఎంత మాత్రం తగ్గకుండగా ఈ సినిమా ఉంటుందని చెప్పగలను' అని దర్శకుడు ఫణీంద్ర చెప్పుకొచ్చాడు. 
 
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇందులోని సంభాషణలు సహజత్వానికి చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ సినిమాలో గౌతమ్ పోషించిన పాత్ర కొత్తగా ఉంటుందనే విషయం ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. సెప్టెంబర్ 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.