శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (17:59 IST)

బుల్లెట్ బండి లక్ష్మణ్ దర్శకత్వంలో టోని కిక్, సునీత మారస్యార్ జంటగా చిత్రం

on Toni Kick, Sunita Marasyar  clap by  Chinnikrishna
on Toni Kick, Sunita Marasyar clap by Chinnikrishna
టోని కిక్, సునీత మారస్యార్ హీరో హీరోయిన్లుగా A3 లేబుల్స్ బ్యానర్‌పై కొత్త చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ సన్నిధానంలో లాంఛనంగా ప్రారంభమైంది.  బుల్లెట్ బండి లక్ష్మణ్ దర్శకత్వంలో గిరీష్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత చిన్నికృష్ణ క్లాప్ కొట్టగా, ఏఐ ప్లెక్స్ ప్రదీప్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రైటర్ వెలిగొండ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా చిన్నికృష్ణ మాట్లాడుతూ, ఈ కథలోని అరవై సీన్స్ ను నేను విన్నాను. రామ్, లక్ష్మణ్ కలిసి చేసిన ఆల్బమ్స్ సౌతిండియాలోనే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. వారి ఆల్బమ్ లోని అల్లా హే అల్లా అనే పాటను కథగా మార్చి సినిమా తీస్తున్నారు. ఈ సినిమా తర్వాత బుల్లెట్ బండి లక్ష్మణ్ టాప్ మోస్ట్ డైరెక్టర్ గా నిలబడతారు. ఈ మూవీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. టీమ్ ను అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
 
రైటర్ వెలిగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘‘సినిమాను నమ్ముకుని, ప్రేమించి, కష్టపడితే ఎక్కడి వరకు రావచ్చు అనటానికి రామ్, లక్ష్మణ్ లే ఉదాహరణ. ప్రైవేట్ ఆల్బమ్స్ తో పాపులారిటీ సంపాదించుకుని ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోకి రావటం హ్యాపీ. వారు చేస్తున్న ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. నిర్మాతగారు కర్ణాటక నుంచి వచ్చి సినిమా చేస్తున్నారు. ఆయనకు ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’
 
బోలే శావలి మాట్లాడుతూ ‘‘యూట్యూబ్ లో బుల్లెట్ బండి లక్ష్మణ్‌కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టోని, సునీత, రామ్, లక్ష్మణ్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుంది. అల్లా హే అల్లా కాన్సెప్ట్ నే సినిమాగా తీయాలనుకోవటం గొప్ప విషయం. సినిమా చేస్తున్న గిరీష్ కుమార్ గారిని అభినందిస్తున్నాను. ఎంటైర్ టీమ్ కు అభినందనలు’’ అన్నారు.
 
నిర్మాత గిరీష్ కుమార్ మాట్లాడుతూ ‘‘నాది కర్ణాటక. రామ్, లక్ష్మణ్ గారు చేసిన అల్లా హే అల్లా పాట వినగానే నచ్చింది. అందులో సోల్ బాగా కనెక్ట్ అయ్యింది. ఎంటైర్ టీమ్‌ను కలిసి మాట్లాడినప్పుడు వారు చెప్పిన విషయాలు ఎంతో నచ్చి సినిమా చేయాలనుకున్నాను. ఏ 3 లేబుల్స్ బ్యానర్ పై తొలి సినిమా చేస్తున్నాం. ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
 
హీరోయిన్ సునీత మారస్యార్ మాట్లాడుతూ ‘‘మా అల్లా హే అల్లా సినిమాను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. ఆ థీమ్ తోనే ఇప్పుడు సినిమా చేయబోతున్నాం. మంచి కథ కుదిరింది. అప్పుడు ఇచ్చినట్లే ఇప్పుడు కూడా ప్రోత్సాహాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. మా టీమ్‌ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
 
డైరెక్టర్ బుల్లెట్ బండి లక్ష్మణ్ మాట్లాడుతూ ‘‘సినీ ఇండస్ట్రీలోకి ఎప్పుడో వచ్చి ఇబ్బందులు పడి వెనక్కి వెళ్లిపోయాం. అయితే జానపద పాటలు ద్వారా ప్రేక్షకుల ఆదరణ పొందాం. నాలోని సినిమా కలను గుర్తించిన మా నిర్మాత గిరీష్ కుమార్ సినిమా చేయటానికి ముందుకు వచ్చారు. ఇది వరకు నాలుగు నిమిషాల్లోని పాటలో ఓ కథను చెప్పే ప్రయత్నం చేశాను. ఇప్పుడు మా నిర్మాత రెండు గంటల సినిమా చేయమని ముందుకు వచ్చారు. మా ప్రతీ పాట, మాట థియేటర్స్ కి ఆడియెన్స్ ను రప్పించేలా, వారి మనసు మెప్పించేలా ఉంటాయి. మా టీమ్ సంకల్ప బలం నా వెనుకుంది. నన్ను యూ ట్యూబ్ లో ఆదరించినట్లే సినిమాలోనూ ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.