1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 6 అక్టోబరు 2023 (18:22 IST)

ఏందిరా ఈ పంచాయితీ ఎలా ఉందంటే.. రివ్యూ

Endira ee panchayati
Endira ee panchayati
నటీ నటులు: భరత్, విషికా లక్ష్మణ్‌,  కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ తదితరులు 
సాంకేతిక బృందం: కెమెరామెన్  : సతీష్‌ మాసం, సంగీతం : పీఆర్ (పెద్దపల్లి రోహిత్), మాటలు  : వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల, ఎడిటర్ :  జేపీ, నిర్మాత : ప్రదీప్ కుమార్. ఎం, డైరెక్టర్  : గంగాధర. టి 
 
ఈమధ్య  గ్రామీణ నేపథ్యంలో చిన్న సినిమాలు రూపొందుతున్నాయి. పచ్చటి పొలాలు, మనుషులు నేపథ్యంలో విలేజ్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే  ‘ఏందిరా ఈ పంచాయితీ’. చిత్రం ద్వారా గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ శుక్రవారమే  ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం. 
 
కథ 
అది రామాపురం అనే గ్రామం. అక్కడ వరుస దొంగతనాలు జరుగడంతో ఊరి సర్పంచ్ పెద్దారెడ్డి (తోటపల్లి మధు) తో పాటు ఊరి పెద్దలైన సుధాకర్ రెడ్డి (రవి వర్మ ) రామచంద్రా రావు (కాశీ విశ్వనాధ్)లు  గ్రామ ప్రజల ఎదుట పంచాయితీ పెట్టి ఓ పోలీసు ఉండాలి అని నిర్ణయిస్తారు, యస్. ఐ కావాలని ప్రయత్నం చేస్తున్న ఆ ఊరి కుర్రాడు అభి (భరత్ల్ ని ఈ ఊరికి కాపలా పెడితే కరెక్ట్ అని భావిస్తారు. అభితో పాటు ఇద్దరు స్నేహితులు కూడా కాపలా కాస్తారు. ఓ రోజు ఊరి పెద్ద రామాంచంద్ర రావు ఇంట్లోనే  జరిగిన దొంగతనం జరుగుతుంది. ఎంక్వ్వైరీ కి వెళ్లిన అభికి సిటీ నుండి వచ్చిన రామాంచంద్ర రావు కూతురు యమున (విషికా లక్ష్మణ్‌ ) ను చూసి ప్రేమలో  పడతాడు. అనంతరం ఒకటవుతారు కూడా. 
 
ఇదిలా ఉండగా, పుంగనూరు ఏం. ఎల్. ఏ నందకిశోర్ నుంచి పిలుపు రావడంతో రామాపురంలోని పెద్దలు అక్కడికి వెళతారు. రాబోయే ఎన్నికలకోసం మూడు కోట్లు రామాపురం పెద్దలకు ఇస్తారు. అవి తీసుకువచ్చిన రాత్రి ఊరిపెద్దలూ ఒకరైన సుధాకర్ రెడ్డి చనిపోతాడు. ఇందుకు అభిని అనుమానించి పోలీసులు అరెస్ట్ చేస్తారు. దీంతో యమున అభిని దూరం పెట్టి తన తండ్రి తెచ్చిన సంబంధం ఒప్పుకొని పెళ్ళికి సిద్దపడుతుంది..ఇక పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చిన అభికి యమునకు నిక్షితార్థం జరుగుతుందని తెలిసి గొడవపడతాడు..ఈ గొడవలో యమున తండ్రి గాయపడతాడు. దాంతో పూర్తిగా యమున అభిని అసహ్యయించుకొని పోలీసులకు పట్టిస్తుంది. ఒకవైపు మర్డర్ కేసు, గొడవ కేస్, ప్రేమించిన అమ్మాయి దూరం కావడం, తను యస్. ఐ కావాలనే  డ్రీమ్, మూడు కోట్లు సొమ్ము ఏమైంది? అనే వాటికి సమాధానమే సినిమా.  
 
సమీక్ష: 
గ్రామీణ వాతావరం యువత, ప్రేమ కథ, ఊరి పెద్దల రాజకీయాలు కలయికతో ఈ కథను దర్శకుడు రాసుకున్నాడు. ఆ కోణంలోనే తెరకేకించాడు. ప్రేమికులు కొత్తవారు అయినా బాగున్నారు. వారి హావ భావాలతో పాటు, మాటలు,పాటలు, ఫైట్స్, ఏమోషన్స్ ఇలా అన్ని షేడ్స్ ను దర్శకుడు రాబట్టాడు. హీరోయిన్ గా నటించిన విషికా లక్ష్మణ్‌ బాగుంది. తెరపై వీరిద్దరి జోడీ చాలా క్యూట్ గా ఉంది.హీరోకు ఫ్రెండ్స్ గా  నటించిన సత్తి (తేజ ), శ్రీను పాత్రలో దర్శకుడు గంగాదర్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్‌తో కామెడీ ట్రాక్‌తో మెప్పించారనే చెప్పాలి.
 
ఊరి జనాలకు ఏ కష్టం వచ్చినా ముందుండే ఉరి పెద్దలుగా పెద్దారెడ్డి (తోటపల్లి మధు),  సుధాకర్ రెడ్డి(రవి వర్మ ), రామచంద్ర ( కాశీ విశ్వనాధ్ ) సరిపోయారు. అభికి తండ్రి గా ప్రేమ్ సాగర్, బ్యాంక్ మేనేజర్ గా సమీర్ లు, యమున ఫ్రెండ్ గా స్వాతి (లత ) చక్కటి పెర్ఫార్మన్స్ చేశాడు.ఇంకా ఇందులో  నటించిన వారంతా  తమ పరిదిమేరకు నటించి ప్రేక్షకులను మెప్పించారని చెప్పవచ్చు.
 
సాంకేతికంగా చూస్తే, చక్కటి కథ, స్క్రీన్ ప్లే తో తీసిన తీరు పర్వాలేదు.. ఎటువంటి డబుల్ మీనింగ్ జోకులు గాని లేకుండా సహజంగా ఆకట్టుకునే సన్నివేశాలతో దర్శకుడు గంగాదర్ కేర్ తీసుకున్నాడు. .పీఆర్  సంగీతం ఒకే.. సునీత పాడిన  తండ్రి కూతుళ్లు మధ్య వచ్చే ఎమోషనల్ సొంగ్ వినసొంపుగా ఉంది. అనురాగ్ కులకర్ణి పాడిన లవ్ సాంగ్ 'ఏమో ఏమో ఏమో ఏమో ఏమౌతుందో నాలో ఏమో' వంటి పాటలు ఆకట్టుకున్నాయి.సతీష్‌ మాసం కెమెరా పనితనం మెచ్చుకోవచ్చు. సస్పెన్స్ తో సాగే ప్రతి సన్నివేశాన్ని తన కెమెరాలో చక్కగా బందించి తన కెమెరా పనితనాన్ని చాటారు. జేపీ ఎడిటింగ్ పనితీరు బాగుంది. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం  ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
 
లవ్ స్టోరీ,, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమాలో సినిమాటిక్ గా దర్శకుడు ఫ్రీడమ్ తీసుకున్నాడు. కథనంలో చిన్నపాటి లోపాలున్నా జాగ్రత్త పడ్డాడు. పరిమిత బడ్జెట్ తో తీసిన ఈ సినిమా అందరు చూడదగ్గ చిత్రంగా మలిచాడు. ఇది ఎంత మేరకు మరింత ఆధారం పొందుతుందో చూడాలి. 
రేటింగ్- 2.75/5