ప్యాంటు, షర్టు వేసుకుని వుంది... ఆమె ఆడది ఎలా అవుతుంది? మహిళా నిర్మాతకు చేదు అనుభవం
ఓ మహిళా సినీ నిర్మాతకు సెన్సార్ సభ్యుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఇంతకీ ఈ చేదు అనుభవానికి కారణం ఆమె తీసిన సినిమానే. ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి హీరోగా నటించిన ‘బాబూ మోషాయ్.. బందూక్ బాజ్’ చిత్రం ఇప్పుడు టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయింది. ఈ చిత్రం సెన
ఓ మహిళా సినీ నిర్మాతకు సెన్సార్ సభ్యుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఇంతకీ ఈ చేదు అనుభవానికి కారణం ఆమె తీసిన సినిమానే. ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి హీరోగా నటించిన ‘బాబూ మోషాయ్.. బందూక్ బాజ్’ చిత్రం ఇప్పుడు టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయింది. ఈ చిత్రం సెన్సార్ కోసం వెళ్లగా, అందులో సీన్లు చూసి సెన్సార్ సభ్యులు షాక్ తిన్నారట.
అంతా బూతులు, ద్వంద్వార్థాలు, అభ్యంతరకర సన్నివేశాలతో ఆ సినిమా చూసేందుకే బీభత్సంగా వుందట. దీనితో వరుసబెట్టి 48 కత్తెర్లు వేసేశారట. అంతేకాదు... ఆ కత్తెర్లు వేసిన తర్వాత కూడా సినిమాలో బూతు వాసన పోలేదని సమాచారం. దీనితో మళ్లీ ఆ చిత్రంపై సమావేశమైన సెన్సార్ సభ్యులు... అక్కడే ఆ చిత్రాన్ని తీసిన మహిళా నిర్మాత వుండటాన్ని గమనించారట.
సదరు మహిళా నిర్మాత కిరణ్ ష్రాఫ్‌ను సెన్సార్ బోర్డులో వున్న ఓ మహిళా అధికారి పిలిచి... ఏవమ్మా మీరూ మహిళే కదా... ఈ చిత్రంలో మహిళను ఇంత అసభ్యంగా ఎలా చూపించారంటూ ప్రశ్నించిందట. ఆమె మాటను అందుకున్న మరో అధికారి... ఆమె మహిళ ఎలా అవుతుంది. ప్యాంటు, షర్టు వేసుకుని వున్నారు కదా అంటూ హేళన చేశారట. ఈ విషయాలన్నిటినీ సదరు మహిళా నిర్మాత మీడియాకు వివరించారు.