1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 22 ఫిబ్రవరి 2024 (18:22 IST)

విశ్వక్ సేన్ చిత్రం గామి లో జాహ్నవిగా చాందిని చౌదరి

Chandini Chaudhary
Chandini Chaudhary
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్ అడ్వెంచర్ డ్రామా 'గామి' థియేట్రికల్ ట్రైలర్ మరో వారంలో ఫిబ్రవరి 29న విడుదల కానుంది. వెరీ టాలెంటెడ్ చాందినీ చౌదరి ఈ సినిమాలో కథానాయిక.
 
ఈరోజు పోస్టర్ ద్వారా చాందిని పాత్రను జాహ్నవిగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. చాందిని కళ్లజోడుతో పెక్యులర్ గా వున్న ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆమె వీధుల్లో నడుస్తూ కనిపించింది. చాందినితో పాటు విశ్వక్ చేసిన సాహస యాత్రను సినిమాలో అద్భుతంగా చూపించనున్నారు.
 
మానవ స్పర్శను అనుభవించలేని అరుదైన వ్యాధితో బాధపడే అఘోరా పాత్రలో విశ్వక్ సేన్ నటించారు. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రానికి క్రౌడ్ ఫండ్ చేశారు. వి సెల్యులాయిడ్ సమర్పిస్తుంది.
 
హారిక పెడాడ, మహ్మద్ సమద్ ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ విశ్వనాథ్ రెడ్డి, రాంపీ నందిగాం అందిస్తున్నారు. నరేష్ కుమారన్ మ్యూజిక్. విద్యాధర్ కాగిత, ప్రత్యూష్ వత్యం స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు.
 గామి మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.