1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : శనివారం, 10 ఫిబ్రవరి 2024 (16:25 IST)

భూతద్ధం భాస్కర్ నారాయణ టైటిల్ లోనే అభిరుచి కనిపిస్తోంది : హీరో విశ్వక్ సేన్

Viswak sen adn siva, rasisingh and ohters
Viswak sen adn siva, rasisingh and ohters
శివ కందుకూరి హీరోగా రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ 'భూతద్ధం భాస్కర్ నారాయణ'. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.  టీజర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రం  టైటిల్ సాంగ్ వైరల్ అయ్యింది. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ రోజు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ చిత్రం  ట్రైలర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. 
 
టీజర్ ఎలా ఉందంటే.. 
'ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు సమీపంలో మునుపెన్నడూ చూడని దారుణ హత్య జరిగింది. ఈ హత్యలని దిష్టి బొమ్మ హత్యలుగా పోలీసులు పేర్కొన్నారు''అనే న్యూస్ బులిటెన్ వాయిస్ మొదలైన ట్రైలర్ ఆద్యంతం  ఆసక్తికరంగా సాగింది. ఒక్క క్లూ కూడా వదలకుండా హత్యలు చేసే  ఓ సీరియల్ కిల్లర్ కేసుని డిటెక్టివ్ భూతద్ధం భాస్కర్ నారాయణ(శివ కందుకూరి) ఎలా పరిష్కరించాడనేది చాలా థ్రిల్లింగ్ గా  ట్రైలర్ లో ప్రజెంట్ చేశారు. అసలు సీరియల్ కిల్లర్ మనిషా రాక్షసుడా ? అని సస్పెన్స్ ని రేకెత్తిస్తూ ట్రైలర్ చివర్లో వచ్చిన సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ చాలా ఎక్సయిటింగా వున్నాయి. డిటెక్టివ్ భూతద్ధం భాస్కర్ నారాయణ గా శివ కందుకూరి పెర్ఫార్మెన్స్ చాలా ప్రామెసింగా వుంది. దర్శకుడు పురుషోత్తం రాజ్ కథని చాలా ఎంగేజింగ్ గా చెప్పారని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బ్రిలియంట్ గా వుంది. విజివల్స్, ప్రొడక్షన్ వాల్యుస్ టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తనికి ట్రైలర్ సినిమాని చాలా క్యురియాసిటీని పెంచింది.
 
అనంతరం మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. రాజ్ కందుకూరి గారు నా కెరీర్ బిగినింగ్ లో ఎంతో సపోర్ట్ చేశారు. ఇది నా సినిమా వేడుకలానే అనిపిస్తుంది. ట్రైలర్ లో శివ చాలా ప్రామెసింగ్ గా కనిపిస్తున్నారు. ట్రైలర్ కూడా చాలా ఆసక్తికరంగా వుంది. శ్రీ చరణ్ నేపధ్య సంగీతం అద్భుతంగా చేశారు. దర్శకుడు పురుషోత్తం రాజ్ సినిమా చాలా గ్రిప్పింగ్ గా తీశారని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతోంది. టైటిల్ లోనే తన అభిరుచి కనిపిస్తోంది. టీం అందరినీ ఆల్ ది బెస్ట్. మార్చి 1 సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అందరూ తప్పకుండా థియేటర్స్ లో చూడాలి'' అని కోరారు.
 
హీరో శివ కందుకూరి  మాట్లాడుతూ.. 'భూతద్ధం భాస్కర్ నారాయణ' కంటెంట్ పై చాలా నమ్మకంగా ఉన్నాము. సినిమాని ప్రేక్షకులకు చూపించాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. ఇంత మంచి కంటెంట్ సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఆనందంగా వుంది. మార్చి 1న కొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తామనే నమ్మకం వుంది. చాలా యునిక్ ఎలిమెంట్స్ తో  తీసిన చిత్రమిది. పురాణాలతో ముడిపడిన ఎలిమెంట్స్ ప్రేక్షకులకు చాలా కొత్త అనుభూతిని పంచుతాయి. దర్శకుడికి పురాణాలపై చాలా మంచి పట్టువుంది. తను చాలా పెద్ద దర్శకుడు అవుతారు. నిర్మాతలు చాలా ప్యాషన్ తో ఈ సినిమా చేశారు. సినిమాకి కావాల్సిన ప్రతిది ఎక్కడా రాజీపడకుండా తీశారు. మా సినిమాకు సపోర్ట్ చేయానికి వచ్చిన విశ్వక్ సేన్ గారికి ధన్యవాదాలు. అలాగే రాహుల్ యాదవ్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. సినిమాని బలంగా నమ్మారు. 'భూతద్ధం భాస్కర్ నారాయణ' యునిక్ క్రైమ్ థ్రిల్లర్. మార్చి 1న వస్తోంది. మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. మా సినిమాని కూడా గొప్పగా ఆదరిస్తారనే నమ్మకం వుంది. దయచేసి అందరూ థియేటర్ లో సినిమా చూడాలి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. భూతద్ధం భాస్కర్ నారాయణ'సినిమా, పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది' అన్నారు. 
 
దర్శకుడు పురుషోత్తం రాజ్ మాట్లాడుతూ..  'భూతద్ధం భాస్కర్ నారాయణ' అందరూ ఎంజాయ్ చేసే చిత్రం. అందరి ఇంటిముందు ఒక దిష్టి బొమ్మ వుంటుంది. ఆ దిష్టి బొమ్మ గురించే ఈ కథ. అదేంటి అనేది సినిమా చూస్తున్నపుడు తెలుస్తుంది. ట్రైలర్ లో రివిల్ చేయని ట్విస్ట్ లు సినిమాలో చాలా వున్నాయి.  మర్చి 1న థియేటర్ లో రివిల్ అవుతాయి'' అన్నారు 
 
హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ.. చాలా డిఫరెంట్ మూవీ ఇది. ఇందులో వుంటే కంటెంట్ చాలా యూనిక్ గా వుంటుంది. ఇందులో చాలా బలమైన పాత్ర చేశాను. దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. శివ చాలా డిఫరెంట్ రోల్ చేశారు. తప్పకుండా సినిమా అందరినీ అలరిస్తుంది'' అన్నారు.
 
నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ..  చాలా డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. ఖచ్చితంగా మంచి విజయం సాధించి,  శివకి మంచి విజయాన్ని ఇస్తుందనే నమ్మకం వుంది. ఇందులో చాలా కొత్త ఎలిమెంట్ ని ప్రయత్నించారు. అది ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం వుంది. నిర్మాతలు ప్యాషన్ తో ఈ సినిమా చేశారు. ఈ వేడుకకు విచ్చేసిన  విశ్వక్ సేన్ కి థాంక్స్'' తెలిపారు. 
 
చిత్ర నిర్మాతలు శశిధర్, స్నేహల్ మాట్లాడుతూ.. విశ్వక్ సేన్, రాజ్ కందుకూరి, రాహుల్ గారికి కి ధన్యవాదాలు.  టీం అందరికీ థాంక్స్. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. మార్చి 1న సినిమా వస్తోంది. మంచి థ్రిల్లర్ ఇది. ఖచ్చితంగా ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు''  అన్నారు