శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (07:53 IST)

మళ్లీ కలిసి నటించాలనుకుంటున్నాం : రవితేజ

Ravi Teja, navadeep, Anupama, Kavya Thapar, Karthik
Ravi Teja, navadeep, Anupama, Kavya Thapar, Karthik
రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమాలో నవదీప్ కూడా నటించాడు. తనకు మంచి బలమైన పాత్ర రావాలని కోరుకున్నా. అది ఈ సినిమాతో తీరింది. ఎవరూ ఊహించని విధంగా తను డైలాగ్స్ చెప్పారు. మళ్లీ కలిసి కామెడీ సినిమాలో నటించాలనుకుంటున్నాం అని రవితేజ అన్నారు. ఆదివారం రాత్రి ఈగల్ సినిమా ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరిగింది. ఈ నెల 9 న ఈ సినిమా విడుదల కాబోతుంది.
 
అలాగే అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ లతో కలిసి నటించడం మొదటి సారి. అనుపమ పాత్రే కథను నడిపిస్తుంది. ఈ సినిమా ఔట్ పుట్ బాగా వచ్చింది. ప్రేక్షకుల తీర్పు కోసం వెయిట్ చేస్తున్నా. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని విజన్ గల దర్శకుడు అతనికి మరిన్ని విజయాలు చేకూరాలని కోరుకుంటున్నా అన్నారు.