సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 25 డిశెంబరు 2022 (10:12 IST)

మరో గొప్పనటుడిని కోల్పోవడం బాధగా ఉంది : చంద్రబాబు

chalapathi rao
కేవలం రెండు రోజుల వ్యవధిలో మరో గొప్ప నటుడిని కోల్పోవడంచాలా బాధగా ఉందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇటీవల గొప్ప నటుడు కైకాల సత్యనారాయణ చనిపోయారు. ఆదివారం వేకువజామున మరో నటుడు చలపతి రావు గుండెపోటు కారణంగా మృతి చెందారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ, తెలుగు సినీ పరిశ్రమ రెండురోజుల్లో ఇద్దరు గొప్ప నటులను కోల్పోవడం బాధాకరమన్నారు. చలపతి రావు మృతి సినీ పరిశ్రమకు తోరని లోటని, ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలుపుతున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. 
 
అలాగే, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, చలపతి రావు కన్నుమూయడం బాధాకరమన్నారు. ప్రతి నాయుకుడి పాత్రల్లోనే కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా తనదైనశైలిలో సినీ అభిమానులను మెప్పించారని తెలిపారు. నిర్మాతగా మంచి చిత్రాలను నిర్మించారని కొనియాడారు. ఒక తరానికి సినీ పరిశ్రమ ప్రతినిధులుగా ఉన్న సీనియర్ నటుడు ఒక్కొక్కరుగా కాలం చేస్తుండటం దురదృష్టకరమని చెప్పారు. చలపతిరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలయజేశారు.