సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 30 జూన్ 2019 (18:18 IST)

కృష్ణకు చంద్రబాబు పరామర్శ.. విజయనిర్మల చిత్రపటానికి అంజలి

సూపర్‌స్టార్ కృష్ణను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పరామర్శించారు. ఆదివారం ఉదయం చంద్రబాబు కుటుంబ సమేతంగా కృష్ణ ఇంటికి వచ్చారు. విజయనిర్మల చిత్రపటానికి నివాళులర్పించారు. చంద్రబాబుతో పాటు ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ ఉన్నారు.
 
ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం విజయనిర్మల అంత్యక్రియలు అభిమానుల అశ్రునయనాల మధ్య జరిగాయి. కుటుంబ సభ్యులను పరామర్శించారు.  కొన్ని అనివార్య కారణాల వల్ల చంద్రబాబు నాయుడు హాజరు కాలేకపోయారు. దీంతో ఆదివారం కృష్ణను చంద్రబాబు పరామర్శించారు.