Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారిన బుట్ట బొమ్మ విడుదల తేదీ

Written By డీవీ
Updated: శనివారం, 21 జనవరి 2023 (17:22 IST)
butta bomma new poster
కాస్త ఆలస్యంగా వచ్చినా ఆ ఆలస్యాన్ని మరిపించేలా వినోదాన్ని అందిస్తామని, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా 'బుట్టబొమ్మ' సినిమా ఉంటుందని చిత్ర నిర్మాతలు నమ్మకంగా చెబుతున్నారు. అయితే జనవరి 26న విడుదల కావాల్సిన ఈ సినిమా కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు చిత్ర బృందం అధికారికంగా ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేసింది.
 
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రూరల్ డ్రామా 'బుట్ట బొమ్మ'. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ భాగస్వామ్యంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
 
ఇప్పటికే నటుడు అర్జున్ దాస్ ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పారు. నాయిక అనిఖా సురేంద్రన్ సైతం ఈ సినిమా కలర్ ఫుల్ గా, అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని అన్నారు.
 
ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన సితార ఎంటర్టైన్మెంట్స్గ తేడాది ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి 'డీజే టిల్లు' చిత్రాన్ని నిర్మించింది. 2022 ఫిబ్రవరిలో విడుదలైన డీజే టిల్లు చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వస్తున్న 'బుట్టబొమ్మ' కూడా ఆ విజయాన్ని పునరావృతం చేస్తుందని చిత్ర నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.

అన్నీ చూడండి

సుప్రీం కోర్టు ఆదేశాన్నే ధిక్కరిస్తారా? బొద్దింక జనతా పార్టీ మైండ్ సెట్ పైన నెటిజన్లు ఫైర్

ఏపీలో స్కైరూట్ ఏరోస్పేస్‌కు 300 ఎకరాల భూమి కేటాయింపు.. నారా లోకేష్ హర్షం

లోకేష్ సార్.. మిమ్మల్ని కలవాలనుంది.. చిన్నారులకు ఓకే చెప్పిన మంత్రి (video)

పెళ్లి కాలేదన్న ఆవేదన.. మహారాష్ట్రలో ఏకంగా 29మంది యువకుల ఆత్మహత్య

టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్‌కు అంతర్జాతీయ అరెస్ట్ వాంటెడ్ నోటీసు

అన్నీ చూడండి

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆల్‌బకరా పండ్లు తినవచ్చా?

కాలేయ వ్యాధుల నివారణకు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్ తప్పనిసరి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్

గర్భిణీ స్త్రీలు నామల చేపలు తినవచ్చా?

మోకాలి నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికీ Knee Replacement అవసరం లేదు, ఐతే...

ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే గుండె పోటు కావచ్చేమో చెక్ చేయించుకోవాలి

తర్వాతి కథనం
Show comments