గురువారం, 30 నవంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 29 సెప్టెంబరు 2022 (12:01 IST)

రాలేక‌పోయిన అభిమానుల‌కూ ధన్యవాదాలు తెలిపిన చిరంజీవి

Megastar Chiranjeevi vandanam
Megastar Chiranjeevi vandanam
మెగాస్టార్ చిరంజీవి రాకతో అనంతపురం ప్రాంతం అంతా జ‌న‌సంద్ర‌మైంది. గాడ్ ఫాదర్ ఫ్రీరిలీజ్ ఈవెంట్ కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు & రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసి అనంతపురం అంతటినీ మెగామయం చేయటమే కాకుండా ఉరుముల వర్షన్ని సైతం లెక్కచేయకుండా మెగా ఈవెంట్ ను జనసంద్రంగా మార్చిన మన మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకు హృదయ పూర్వక ధన్యవాదాలు. 
 
అదేవిధంగా ఆ కార్యక్రమ ప్రాంగణం సరిపోక అనంతపురం పురవీధుల్లో, బెంగుళూరు హైవే రహదారులలో నిలిచిపోయిన లక్షలాది అభిమానులకు కూడా హృదయ పూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియ‌జేస్తూ గురువారంనాడు అఖిల భారత చిరంజీవి యువత అధ్య‌క్షుడు రవణం స్వామినాయుడు తెలియ‌జేశారు.
 
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తడుస్తూ, అభిమానుల కోలాహలనికి మురుస్తూ,  ఆ చినుకులే అభిమానుల ఆనందపు జల్లులా భావిస్తూ,  ఆ వర్షమే పువ్వుల వర్షంలా ఆస్వాదిస్తూ, చిత్ర విశేషాలు తెలుపుతూ,  చిత్ర బృందాన్ని అభినందిస్తూ, ఎంతో ఉత్తేజపరుస్తూ సాగిన మెగాస్టార్ అద్భుత  ప్రసంగాన్నికి ధన్యవాదాలు తెలియ‌జేస్తూ ప్ర‌క‌ట‌న‌లో స్వామినాయుడు తెలియ‌జేశారు.