ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 15 జనవరి 2024 (19:38 IST)

ఏప్రిల్‌కు వాయిదాపడిన చియాన్ విక్రమ్ 'తంగలాన్' మూవీ

tangalaan
చియాన్ విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం "తంగలాన్". ఈ చిత్రాన్ని తొలుత సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించారు. కానీ వాయిదావేసి జనవరి 26వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో ఇపుడు మరోమారు ఈ చిత్రం విడుదలను వాయిదావేస్తున్నట్టు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నారు. 
 
ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా పోస్టర్‌ విడుదల చేసి, సంక్రాంతి పండగ శుభాకాంక్షలు చెప్పింది. ముందుగా ఈ చిత్రాన్ని రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26న విడుదల చేయాలనుకున్నారు దర్శక, నిర్మాతలు. వాయిదా వేయడానికి కారణమేంటో వెల్లడించలేదు. ఏప్రిల్‌లో ఏ రోజున విడుదల చేస్తారో త్వరలోనే ప్రకటించనున్నారు.
 
కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫ్యాక్టరీలోని తమిళ కార్మికుల జీవితాల ఆధారంగా దర్శకుడు పా.రంజిత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాళవిక మోహనన్‌, పార్వతి తిరువోతు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెంచాయి. 
 
'నేను ఇప్పటివరకు ఏ సినిమా కోసం ఇంత కష్టపడలేదు. ఇదొక విభిన్నమైన కథ. ఇందులో గ్లామర్‌కు చోటులేదు. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు మరో ప్రపంచంలోకి వెళ్లినట్లు అనిపిస్తుంది" అని ప్రచారంలో భాగంగా విక్రమ్‌ తెలిపారు.