శనివారం, 23 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 2 మార్చి 2018 (10:18 IST)

సౌత్ ఇండియాలో (ఐదు రాష్ట్రాలు) "బొమ్మ" పడదు...

దక్షిణ భారతదేశంలోని థియేటర్ యాజమాన్యాలు సమ్మెకు దిగాయి. ఫలితంగా ఐదు రాష్ట్రాల్లో థియేటర్లలో శుక్రవారం నుంచి బొమ్మపడదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఉన్న చిత్రసీమలన్నీ ఏక

దక్షిణ భారతదేశంలోని థియేటర్ యాజమాన్యాలు సమ్మెకు దిగాయి. ఫలితంగా ఐదు రాష్ట్రాల్లో థియేటర్లలో శుక్రవారం నుంచి బొమ్మపడదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఉన్న చిత్రసీమలన్నీ ఏకమై సినిమా థియేటర్లను మూసివేశాయి. ఫలితంగా శుక్రవారం నుంచి సినిమాలను ప్రదర్శించవు. 
 
ఈ మేరకు దక్షిణాది నిర్మాతల మండలి ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో మార్చి 2వ తేదీ శుక్రవారం నుంచి సినిమా థియేటర్లు బంద్ చేస్తున్నట్లు పేర్కొంది. హైదరాబాద్‌లో సమావేశమైన దక్షిణాది నిర్మాతల మండలి ఈ నిర్ణయం ఫైనల్‌గా తీసుకుంది. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 
 
ప్రాంతీయ సినిమాలకు వర్చ్యువల్ ప్రింట్ ఫీజు (వీపీఎఫ్)ను తగ్గించాలని డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లను వీరు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత ధరలో కనీసం 25 శాతం ఛార్జీ తగ్గింపును కోరారు. ఇందుకు సర్వీస్ ప్రొవైడర్లు అంగీకరించలేదు. 9 శాతం వరకు తగ్గిస్తామని చెప్పారు. ఇందుకు నిర్మాతల మండలి ఒప్పుకోలేదు. 
 
ఇంగ్లీష్ (హాలీవుడ్) సినిమాలకు వీపీఎఫ్‌ను వసూలు చేయడం లేదనీ, దక్షిణాది సినిమాలకే ఎందుకు ఇంత ధర వసూలు చేస్తున్నారని సురేష్ బాబు ప్రశ్నించారు. అందువల్ల తమ ప్రధాన డిమాండ్‌పై డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు దిగివచ్చేవరకు థియేటర్ల బంద్ చేస్తున్నట్టు ప్రటించారు. ఈ బంద్‌కు ఐదు రాష్ట్రాల్లోని నిర్మాతలు, పంపిణీదారులు మద్దతు ప్రకటించారు.