హీరో రాజశేఖర్‌కు ప్లాస్మా థెరపీ.. సిటీ న్యూరో సెంటర్ ప్రకటన
ఇటీవల కరోనా వైరస్ బారినపడిన తెలుగు హీరో డాక్టర్ రాజశేఖర్‌కు ప్లాస్మా థెరపీతో చికిత్స చేస్తున్నట్టు ఆయనకు వైద్యం చేస్తున్న సినీ న్యూరో సెంటర్ వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ఓ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
కరోనా వైరస్ బారినపడిన రాజశేఖర్‌ను హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సిటీ న్యూరో సెంటర్ వర్గాలు హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ విడుదల చేశాయి. ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ రత్నకిశోర్ బులెటిన్‌లో రాజశేఖర్ ఆరోగ్య వివరాలు తెలిపారు.
నటుడు రాజశేఖర్‌కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని, ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆయనకు చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీ, సైటోసార్బ్ థెరపీ ఇస్తున్నామని వివరించారు. రాజశేఖర్‌ను తమ వైద్యుల బృందం నిశితంగా పర్యవేక్షిస్తోందని డాక్టర్ రత్నకిశోర్ తాజా హెల్త్ బులెటిన్‌లో తెలిపారు.