శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 సెప్టెంబరు 2020 (16:12 IST)

హమ్మయ్య.. ప్రాణగండం నుంచి తప్పించుకున్న ఎస్పీబీ

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో లెజెండరీ సింగర్‌గా గుర్తింపు పొందిన ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం ఎట్టకేలకు ప్రాణపాయం నుంచి తప్పించుకున్నారు. ఆగస్టు నెలలో కరోనా వైరస్ బారినపడిన ఆయన.. ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అయితే, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు ఆయన కుమారుడు ఎస్.పి.చరణ్ తెలిపారు.
 
కాగా, కరోనా వైరస్ బారిన ఎస్బీబీ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ముఖ్యంగా, ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో శ్వాసపీల్చడం కష్టంగా మారిపోయింది. దీంతో ఆయనకు వెంటిలేటర్‌తో పాటు ఎక్మో పరికరాన్ని అమర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. 
 
ఓ దశలో పరిస్థితి విషమంగా మారడంతో ఎస్పీ బాలును ఐసీయూకి తరలించి వెంటిలేటర్ అమర్చారు. ఆపై ఎక్మో సాయం కూడా అందిస్తున్నారు. దీనిపై ఎస్పీ చరణ్ తాజాగా ఓ ప్రకటన చేశారు.
 
త్వరలోనే తన తండ్రికి ఎక్మో, వెంటిలేటర్ తొలగించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతానికి ఆయనకు వెంటిలేటర్, ఎక్మో వ్యవస్థల సాయంతోనే చికిత్స జరుగుతోందని వెల్లడించారు. ఫిజియోథెరపీ కొనసాగుతోందని ట్విట్టరులో వివరించారు. 
 
ఎంజీఎం ఆసుపత్రి వైద్యుల బృందానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, అంతేకాకుండా, తన తండ్రి క్షేమం కోసం ప్రార్థిస్తున్న వారందరికీ ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.