గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 అక్టోబరు 2020 (08:30 IST)

హీరో రాజశేఖర్‌కు ఐసీయూలో చికిత్స.. వైద్యులు ఏమంటున్నారు?

తెలుగు హీరో రాజశేఖర్ కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ కాగానే ఆయన ఆస్పత్రిలో చేరారు. అయితే, ఆయన ఆస్పత్రిలో చేరి రెండు వారాలు దాటిపోయినా ఆయన ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. దీంతో ఆయన్ను ఐసీయూ వార్డులోకి తరలించి చికిత్స అందిస్తున్నా. 
 
ఈ క్రమంలో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైద్య చికిత్సకు ఆయన శరీరం స్పందిస్తోందని వైద్యులు తెలిపారు. కాగా, ఇటీవల నటుడు రాజశేఖర్, ఆయన కుటుంబ సభ్యులకు ఇటీవల కరోనా సోకిన సంగతి తెలిసిందే. అయితే, జీవితా రాజశేఖర్ కుమార్తె శివాత్మిక, శివానీలు మాత్రం ఈ వైరస్ బారినుంచి కోలుకున్నారు. కానీ, జీవిత, రాజశేఖర్‌లకు మాత్రం ఈ వైరస్ ఇంకా తగ్గలేదు. 
 
మరోవైపు, రాజశేఖర్‌ ఆరోగ్యం విషమించిందన్న వార్తలను ఆయన కుటుంబం ఖండించింది. పుకార్లను నమ్మవద్దని కోరింది. ‘నాన్నగారు కోవిడ్‌తో పోరాడుతున్నారు. మీ అందరి ప్రార్థనలు కావాలి. మీ ప్రేమతో ఆయన మరింత ఆరోగ్యంగా బయటకు వస్తారు’ అని ఆయన కుమార్తె శివాత్మిక గురువారం ట్వీట్‌ చేశారు. ఇదే విషయాన్ని ఒక లేఖ ద్వారా కూడా ఆయన కుటుంబం తెలిపింది.