1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 26 జనవరి 2023 (06:45 IST)

సిరివెన్నెల కుటుంబానికి విశాఖలో ఇంటి స్ధలం మంజూరు చేసిన సీఎం వైఎస్‌ జగన్‌

Sirivennela family with jagan
Sirivennela family with jagan
ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్‌ జగన్‌ను సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సతీమణి, కుటుంబ సభ్యులు నిన్న రాత్రి అమరావతిలో కలిశారు. సిరివెన్నెల కుటుంబాన్ని ఆదుకున్నందుకు సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.  దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో సిరివెన్నెల అనుబంధాన్ని సీఎం జగన్ తో కుటుంబ సభ్యులు  పంచుకున్నారు.  సిరివెన్నెల అనారోగ్య సమయంలో చికిత్స ఖర్చులను భరించిన జగన్ సర్కార్ కు కృతజ్ఞతలు తెలిపారు. 
 
ఈ సందర్భంగా సిరివెన్నెల కుటుంబానికి విశాఖలో ఇంటి స్ధలం మంజూరు చేసారు  సీఎం వైఎస్‌ జగన్‌.  సిరివెన్నెల కుటుంబానికి అవసరమైన సాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఇవ్వనున్నట్లు ఆయన కుటుంబానికి భరోసా ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌.  సీఎంని కలిసిన సిరివెన్నెల సతీమణి పద్మావతి, కుమారులు యోగేశ్వర శర్మ, రాజా, కుమార్తె శ్రీ లలితా దేవి, సిరివెన్నెల సోదరుడు సీఎస్‌.శాస్త్రి.