Daily Horoscope
✕

క్లీన్ యూ సర్టిఫికేట్ తో దృశ్యం 2 సెన్సార్ పూర్తి

Updated: సోమవారం, 20 సెప్టెంబరు 2021 (17:28 IST)
drushyam 2
వెంకటేష్ కెరీర్‌లో దృశ్యం సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ దృశ్యం 2 రెడీ అయింది. ఈ మూవీని జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తుండగా.. ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ మూవీకి క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చారు. దీన్ని బట్టి ఈ చిత్రాన్ని కుటుంబ సభ్యులందరితో కలిసి అందరూ వీక్షించవచ్చని తెలుస్తోంది. దృశ్యం సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో.. సీక్వెల్ మీద అంచనాలు ఆకాశాన్నంటాయి. త్వరలోనే చిత్రయూనిట్ ఈ మూవీకి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నారు.
 
మొదటి పార్ట్‌లో కనిపించిన మీనా, నదియ, నరేష్, కృతిక, ఈస్తర్ అనిల్ ఇలా అందరూ కూడా సీక్వెల్‌లో నటిస్తున్నారు. ఇక సంపత్ రాజ్, పూర్ణలు కొత్తగా సీక్వెల్‌లో కనిపించబోతోన్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు థ్రిల్లింగ్ పార్ట్ ఎంతో ఉంది. వెంకటేష్ నటన అందరినీ మెస్మరేజ్ చేయబోతోంది.
 
నటీనటులు: మీనా, నదియ, నరేష్, కృతిక, ఈస్తర్ అనిల్, సంపత్ రాజ్, పూర్ణలు
 
సాంకేతిక బృందంః  దర్శకుడు: జీతూ జోసెఫ్, నిర్మాతలు: డి సురేష్ బాబు, ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, రాజ్ కుమార్ థియేటర్స్, సంగీతం : అనూప్ రూబెన్స్, కెమెరామెన్: సతీష్ కురూప్

అన్నీ చూడండి

మహిళపై కూడా గ్యాంగ్ రేప్ కేసు పెట్టొచ్చు : ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

అక్టోబర్ 16, 2026 : తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

హైదరాబాద్‌లో నవరాత్రి అన్నప్రసాద స్థలంపై చేపల వ్యర్థాలను పారవేసిన ముస్లిం మహిళ అరెస్టు

వేగా జ్యూవెలర్స్ ఆధ్వర్యంలో 'రాగ దాండియా ఉత్సవ్' : ఎండీ నవీన్ వనమా

వివాహేతర సంబంధం... భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య

అన్నీ చూడండి

45 ఏళ్లు పైబడిన 10 మంది పురుషులలో ఏడుగురు ప్రోస్టేట్ క్యాన్సర్‌కి సంబంధించిన ఒక్క రిస్క్ ఫ్యాక్టర్ కూడా తెలియదు

విరేచనాలు అవుతున్నప్పుడు కర్బూజా జ్యూస్ తాగితే ఏమవుతుంది?

తులసి టీతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

చెన్నై కావేరీ ఆస్పత్రిలో అధునాతన ఎక్మో వైద్య సేవలు

హైదరాబాద్‌లో మధుమేహ భారం: ముందస్తు పరీక్షలు, జీవనశైలిపై అవగాహన అవసరం

తర్వాతి కథనం
Show comments