కోర్టు తీర్పు హ్యాపీగా వుంది - సాయిపల్లవి
హీరోయిన్ సాయిపల్లవి నటించిన `విరాటపర్వం` సమయంలో గోహత్య, కాశ్మీర్ పండిట్ ఊచకోత గురించి వ్యాఖ్యలు చేసింది. దీనిపై ఆమెపై భజరంగదళ్ హైదరాబాద్ లో కేసు నమోదు చేశారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాలో కశ్మీర్ పండిట్ల మారణ హోమాన్ని ముస్లిం డ్రైవర్‌పై దాడితో పోల్చుతూ ఆమె చేసిన కామెంట్స్‌పై హిందూవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్సలిజం, హింస తదితర అంశాల గురించి సాయి పల్లవి మాట్లాడుతూ , అందరూ మంచి మనుషుల్లా ఉండాలి. ఎవరో ఎవరినో హర్ట్ చేస్తున్నారు. మనం కూడా అలా చేయకూడదు. మానవీయకోనంలో ఆలోచించాలని తెలిపింది. ఆమెపై పెట్టిన కేసు గురించి సోమవారంనాడు సాయిపల్లవికి ప్రశ్న ఎదురైంది.
ఆమె ఈవిధంగా వివరణ ఇచ్చింది. నాకు తెలుగు బాగానే వచ్చు. మాట్లాడతాను. హిందీ సరిగ్గా రాదు. ఇంగ్లీషులో మాట్లాడతాను. నేను మాట్లాడిన ఆంగ్లపదాలను అర్థం మారేలా కొందరు రాసి వుండవచ్చు. అందుకే నాపై వేసిన కేసును హైకోర్టుకూడా పరిశీలించి కొట్టివేసింది. అందుకే హ్యాపీగా నేను మీముందు నవ్వుతూ మాట్లాడుతున్నాను. నేను కోర్టు డ్రామా నేపథ్యంలో సాగే `గార్గి` సినిమాలో నటించాను.తప్పకుండా చూసి ఆనందించండి అంటూ తెలిపింది.