ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (17:41 IST)

బెస్ట్ యాక్టర్ గా రామ్ చరణ్ కు క్రిటిక్ ఛాయిస్ సూపర్ అవార్డు

Ramcharan best actor
Ramcharan best actor
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఇప్పుడు హాలీవుడ్ చేరింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో ఆయన నటన లెజెండరీ హాలీవుడ్ దర్శక నిర్మాత నుంచి విమర్శకులు ప్రేక్షకుల వరకు అందరినీ ఆకట్టుకుంది. రామ్ పాత్రలో నటన గురించి జేమ్స్ కామరూన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా ప్రస్తావించారంటే... చరణ్ పర్ఫామెన్స్ ఎంత ఎఫెక్ట్ చూపించిందనేది అర్థమవుతుంది. 
 
ట్రిపుల్ ఆర్ సినిమాను రామ్ చరణ్ నటన మరో స్థాయిలో నిలబెట్టింది. అంతర్జాతీయ స్థాయిలో సినిమాకు నామినేషన్లు సాధించి పెట్టింది. ఇప్పుడు బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీ క్యాటగిరిలో రామ్ చరణ్ కు నామినేషన్ లభించింది. ది క్రిటిక్స్ ఛాయిస్ అసోసియేషన్ రెండేళ్లుగా 'ది క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్' పేరుతో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు ఇస్తుంది. క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ మూడో ఎడిషన్ లో ట్రిపుల్ ఆర్ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీ కేటగిరీలో రామ్ చరణ్ నామినేషన్ అందుకున్నారు. మార్చి 16న విన్నర్స్ డిటైల్స్ అనౌన్స్ చేస్తారు.
 
గ్లోబల్ స్టార్ అంటే ఏమిటో రామ్ చరణ్ క్రేజ్ చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఆయన వేసే ప్రతి అడుగు సంచలనం అవుతోంది. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో చెప్పులు లేకుండా నడవడం నుంచి అమెరికాలో దిగడం వరకు... ఆయన ప్రతి అడుగును అభిమానులు, ప్రేక్షకులు ఫాలో అవుతున్నారు. స్వామి మాలతో అమెరికా వెళ్లిన రామ్ చరణ్... అక్కడ ఆలయంలో మాల తీశారు. గుడ్ మార్నింగ్ అమెరికా కార్యక్రమంలో పాల్గొనడానికి వెళితే... ఆయన్ను చూడటం కోసం అభిమానులు బారులు తీరారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉంటున్న రామ్ చరణ్ వ్యక్తిత్వం చూసి అమెరికన్లు కూడా అభిమానులు అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అమెరికా షోలో సింపుల్ గా చరణ్ కూర్చున్న తీరు గురించి హోస్ట్ కూడా మాట్లాడారు. నెక్స్ట్ రామ్ చరణ్ చేస్తున్న మూవీస్ గురించి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.
 
ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ భారీ సినిమా చేస్తున్నారు. హీరోగా ఆయన 15వ సినిమా అది. ఆ తర్వాత సానా బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.