సీనియర్ నటుడు వీరభద్రంకు ప్రమాదం
సీనియర్ నటుడు వీరభద్రంకు ప్రమాదం జరిగింది. ఆయన ఎన్.టి.ఆర్. సినిమాల నుంచి నేటి జనరేషన్ వరకు సహనటుడిగా నటించాడు. జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన ఆయనది గుంటూరు జిల్లా. నటనపై వున్న తపనతో ఊరు విడిచి హైదరాబాద్ మోతీనగర్ లో అద్దెకు వుంటున్నారు. ఈ క్రమంలో పలు టీవీ సీనియల్స్, సినిమాలు, వెబ్ సిరీస్ లలోనూ కూడా నటించారు. దానితోపాటు జూనియర్ ఆర్టిస్టులకు వేషాలు ఇప్పించే బాధ్యతను కూడా తీసుకుని హైదరాబాద్ లోని తన స్నేహితురాలితో కలిసి కాస్టింగ్ ఏజెన్సీ కూడా పెట్టారు.
విశ్వసనీయ సమాచారం మేరకు రెండు రోజుల క్రితం ఆయన ఇంటిలో ప్రమాదవశాత్తూ పడిపోయారని తెలిసింది. ఆయన తలకు తీవ్ర గాయమైంది. దానితో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ట్రీట్ మెంట్ అనంతరం డాక్టర్లు పేషెంట్ క్రిటికల్ అని చెప్పడంతో గుంటూరు లోని ఆయన ఊరుకి తీసుకెళ్ళారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సభ్యుడు కూడా. ట్రీట్ మెంట్ కు ఖర్చు ఎక్కువ అవుతుంది కనుక కొంతమంది తగు విధంగా సహకరించారు. ఆయనకు ఒక కుమారుడు, భార్య వున్నారు.