శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 23 ఏప్రియల్ 2022 (16:41 IST)

కెవ్వు కేక... నాకంటే 12 ఏళ్లు చిన్నవాడితో డేటింగ్ చేస్తున్నా, తప్పేంటి?: మలైకా

Malaika Arora
కెవ్వు కేక... అంటూ చిందులు వేసిన భామ గుర్తుండే వుంటుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు ఐటెంసాంగులు చేసి గుర్తింపు తెచ్చుకుని గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్వు కేక అంటూ నర్తించిన మలైకా అరోరా. ఈమె ఎక్కువగా వార్తల్లోకి ఎక్కుతుంటుంది.

 
తనకంటే వయసులో 12 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చకు కారణమైంది. దీనిపై ఇటీవల ఓ ఛానల్ విలేకరి ప్రశ్నించాడు. మలైకా సమాధానమిస్తూ.. ఏం, మగవాళ్లు తమకన్నా వయసులో 20 ఏళ్లు తక్కువున్న అమ్మాయిలతో డేటింగ్ చేయవచ్చు, పెళ్లిళ్లు చేసుకోవడంలేదా... అలాంటప్పుడు మగాళ్లకి ఓ రూలు, ఆడవాళ్లకి ఇంకో రూలా? అంటూ ఇంతెత్తున లేచిందట.

 
తను యుక్తవయసులోకి అడుగుపెట్టేటప్పుడు తన తల్లి తనతో చెప్పిన మాటలు గుర్తున్నాయంటోంది. స్వశక్తితో ఎదుగు... నీకు తోచింది ఏదయినా చేసేయ్... వెనక్కి తిరిగి చూడొద్దని తన తల్లి తనకు చెప్పేదనీ, అందుకే తనకు ఏది అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్తానంటోంది ఈ ముద్దుగుమ్మ.