సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 5 డిశెంబరు 2024 (17:14 IST)

తీవ్ర విచారంలో పుష్ప 2 నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్

Pushpa2 poster
Pushpa2 poster
తాము తీవ్ర విచారంలో వున్నామని పుష్ప 2 నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు. కొద్దిసేపటి క్రితమే వారు సోషల్ మీడియాలో స్పందించారు. గత రాత్రి స్క్రీనింగ్ సమయంలో జరిగిన విషాద సంఘటనతో మేము చాలా బాధపడ్డాము. మా ఆలోచనలు, ప్రార్థనలు కుటుంబం  వైద్య చికిత్స పొందుతున్న చిన్న పిల్లవాడితోనే ఉన్నాయి. ఈ క్లిష్ట సమయంలో వారికి అండగా నిలవడానికి మరియు సాధ్యమైన అన్ని సహాయాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. అందుకే తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని మైత్రి మూవీ మేకర్స్ పేర్కొన్నారు.
 
పుష్ప2 సినిమా రిలీజ్ ముందు రోజు అనగా నిన్న రాత్రి 10గంటలకు హైదరాబాద్ సంథ్య థియేటర్లో అభిమానుల షో వేశారు. ఇందుకు తండోపతండాలుగా ఫ్యాన్స్ హాజరయ్యారు. అయితే అల్లు అర్జున్ వస్తున్నాడు అనగానే పెద్ద ఎత్తున తోపులాట జరగడం, ఓ మహిళ మృతి చెందగా.. ఓ చిన్నారి తీవ్ర గాయాలపాలైంది. ఈ విషయం గురించి తెలుసుకున్న చిత్ర యూనిట్, తాజాగా దీనిపై స్పందించింది. ఇలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.