పోస్టర్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ధనుష్...
గత ఏడాది తమిళ్‌లో వచ్చిన వడ చెన్నై, మారి 2 సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న స్టార్ ధనుష్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ అసురన్. ఆకట్టుకునే కథ, కథనాలతో యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల రిలీజ్ అయి, ఆయన ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ సంపాదించింది.
ఈ సినిమాలోని ధనుష్ లుక్‌కు సంబంధించి రెండు పోస్టర్స్‌ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఓల్డ్ స్టైల్లో హాఫ్ హాండ్స్ చెక్స్ షర్ట్ వేసుకుని కూల్‌గా ఉన్న పోస్టర్ ఒకటి అయితే, అదేవిధమైన డ్రెస్‌తో కత్తి పట్టుకుని ఆవేశంతో చూస్తున్న మరొక పోస్టర్ని రిలీజ్ చేసారు. ఈ రెండు పోస్టర్స్ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
కలై పులి ఎస్ థాను సమర్పణలో, వి క్రియేషన్స్ బ్యానర్ పైన వెట్రిమారన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటి మంజు వారియర్ తొలిసారి తమిళ సినిమా పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. ఇంకా టీజె అరుణసలం, బాలాజి శక్తివేల్, ప్రకాష్ రాజ్, పశుపతి తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా, వేల్రాజ్ సినిమాటోగ్రఫీని, జివి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, ఈ సినిమాను అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.