శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 1 మే 2023 (18:05 IST)

సెల్ఫిష్‌లో దిల్ ఖుష్ పాట నా కెరీర్ లో గుర్తుండిపోతుంది : హీరో ఆశిష్

Ashish, Dil Raju, Kashi Vishal, ramagojayya shastri
Ashish, Dil Raju, Kashi Vishal, ramagojayya shastri
హీరో ఆశిష్, నూతన దర్శకుడు కాశీ విశాల్ దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్‌ తో కలిసి ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సెల్ఫిష్‌’తో వస్తున్నారు. 
 
పోస్టర్లలో ఆశిష్ మాస్ క్యారెక్టర్, నిర్లక్ష్య వైఖరిని మనం ఇప్పటివరకు చూశాం. ఈ రోజు, మేకర్స్  ఫస్ట్ సింగిల్‌ ను లాంచ్ చేశారు. ఇది హీరో పాత్ర తాలుకా మరొక కోణం చూపుతుంది. ఇది సెల్ఫిష్ దిల్ కా ఫస్ట్ బీట్. దిల్ ఖుష్  పాటలో కథానాయిక పాత్ర పోషించిన ఇవానాని ఆరాధించే కథానాయకుడి ఆనందాన్ని ప్రజెంట్ చేస్తుంది. ఈ పాటను తెలుగు, హిందీ పదాల అందమైన అల్లికతో సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి రాశారు.
 
మెలోడీ స్పెషలిస్ట్ మిక్కీ జె మేయర్ లైవ్లీ బీట్‌ లతో చక్కని మెలోడీని స్కోర్ చేశాడు. జావేద్ అలీ  పాటను అద్భుతంగా పాడారు. ఈ పాట చార్ట్‌ బస్టర్‌ గా మారడానికి అన్ని ఎలిమెంట్స్ వున్నాయి. అలాగే పాట మ్యూజిక్ చార్ట్‌లలో టాప్ లో వుండబోతుంది. ఇన్స్టంట్ గా కనెక్ట్ అయ్యే ఈ పాట ఒక అడిక్టివ్ నెంబర్.
 
ఆశిష్ తన డ్యాన్స్ స్కిల్స్ ని చక్కగా ప్రదర్శించాడు. ఎనర్జిటిక్‌ గా కనిపించే యంగ్ చాప్ ఎలిగెంట్ మూవ్స్ తో ఆకట్టుకున్నాడు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.
 
సాంగ్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఆశిష్ పుట్టిన రోజు మీడియా మిత్రుల ద్వారా ఈ పాటని విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది. సుకుమార్ నేను మళ్ళీ 19 ఏళ్ల తర్వాత క్రియేటివ్ వర్క్ చేస్తున్నాం. రౌడీ బాయ్ జరుగుతున్నపుడు ఈ సినిమా ఐడియా వున్నప్పుడే ఆసక్తికరంగా కనిపించింది. రౌడీ బాయ్ ఒక కొత్త కుర్రాడికి రావల్సినంత రెవెన్యూ తెచ్చుకొని, ప్రశంసలు కూడా అందుకుంది. ఆశిష్ కు మంచి మార్కులు పడ్డాయి. సెల్ఫిష్ కథ విన్నప్పుడు ఆశిష్ కు బావుంటుందనిపించింది. మిక్కీ మాంచి ట్యూన్ ఇచ్చారు. ఈ పాట లిరిక్స్ విషయంలో మొదటి నుంచి చాలా పట్టుదలగా వున్నాను. లిరిక్స్ ఇంత బాగా రావడానికి కారణం రామజోగయ్య శాస్త్రి గారు. మిక్కీ తో మాది అద్భుతమైన జర్నీ. అందరూ కష్టపడి మంచి సాంగ్ ఇచ్చారు. మేరా దిల్ ఖుష్ హువా.. నా ‘దిల్’ రైట్స్ఈ పాటకు తీసుకున్నారు. (నవ్వుతూ). ఓల్డ్ సిటీ  నేపధ్యంలోజరిగే ఈ కథలో హిందీ లిరిక్స్ కూడా అవసరమయ్యాయి. దానికి తగ్గట్టుగానే కొన్ని హిందీ పదాలు కూడా వాడాం. ఇది ధూల్ పేట్ నేపధ్యంలో కి వచ్చిన తర్వాత ఓ కొత్త ప్రయోగం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇందులో ఇదొక్క పాటే మిక్కీ జే మేయర్ చేస్తున్నారు. అనూప్ రుబెంస్ మరో రెండు పాటలు చేశారు. మరో రెండు పాటలు వేరే సంగీత దర్శకులు చేస్తారు. సినిమాకి సరిపోయేలా కొత్తగా చేయాలని ప్రయత్నిస్తున్నాం. దర్శకుడు కాశీ విశాల్ ని ఖచ్చితంగా కష్టపెడతాను( నవ్వుతూ) ప్రేక్షకులకు విజయవంతమైన సినిమా ఇవ్వడం అంత తేలికకాదు. దసరా, విరూపాక్ష, బలగం.. ఇలా కొత్తదనంతో కొత్త దర్శకులు తీసిన చిత్రాలని ప్రేక్షకులని మెప్పిస్తున్నాయి. కొత్తదనం లేకపోతే చూడటానికి ప్రేక్షకులు రెడీగా లేరు. అది ఇవ్వడానికి రాత్రిపగలు కష్టపడాల్సిందే. మాంచి టీమ్ తో చేస్తున్న చిత్రమిది. సినిమాని నేచురల్ గా తీయడానికి ప్రయత్నిస్తున్నాం. నేను గానీ, సుకుమార్ గారు గానీ వెనుక మాత్రమే వుంటాం. ప్రేక్షకులకు నచ్చాల్సింది మాత్రం ఆశిష్. దాని కోసం తను రాత్రిపగలు కష్టపడితేనే ప్రేక్షకులకు రీచ్ అవుతారు. మంచి సినిమాని ఎంపిక చేసుకొని కష్టపడితేనే ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ అవ్వడానికి అవకాశాలు వున్నాయి. అవకాశం వుంది కాబట్టి కష్టపడాలి. కష్టపడితే ఆ కష్టాన్ని గుర్తించి ఎదో ఒక రోజు ఒక మంచి సినిమాతో ప్రేక్షకులు తమ హృదయాల్లోకి తీసుకుంటారు’’ అన్నారు. 
 
ఆశిష్ మాట్లాడుతూ.. మీడియా మిత్రులతో కలసి పాటని లాంచ్ చేయడం చేయడం చాలా ఆనందంగా వుంటుంది. నా బర్త్ డే ఇంత స్పెషల్ గా చేసినందుకు కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం నేను, దర్శకుడు కాశీ చాలా కష్టపడ్డాం. ఇది మా ఇద్దరికీ ఒక జీవితం. ఇది మాకు లైఫ్ ఇచ్చే సినిమా. ప్రాణం పెట్టి కష్టపడ్డాం. ఇంకా షూటింగ్ జరుగుతోంది. యువరాజ్ గారు అద్భుతమయానా విజువల్స్ ఇచ్చారు. రామజోగయ్య శాస్త్రి చాలా చక్కని సాహిత్యం అందించారు. ఈ పాట నా కెరీర్ లో గుర్తుండిపోతుంది. ఇంత మంచి పాట ఇచ్చిన మిక్కీ జే మేయర్ గారికి కృతజ్ఞతలు. చిత్ర యూనిట్ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. హర్షిత్ అన్నకి థాంక్స్. రాజు గారి మాటల్లో కృతజ్ఞతలు చెప్పలేను. చెప్పినా అది సరిపోదు. ప్రక్రుతికే వదిలేస్తున్నా. భవిష్యత్ లో ప్రకృతే నా నుంచే కృతజ్ఞతలు చెబుతూ వుంటుంది’’ అన్నారు.
 
విశాల్ కాశీ మాట్లాడుతూ.. నేను సుకుమార్ గారి దగ్గర పని చేశాను. ఆయనకి ఈ పాయింట్ చేపినపుడు చాలా నచ్చింది. స్క్రిప్ట్ వర్క్ చేశాం. ఈ పాయింట్ కి రాజు గారే కరెక్ట్ అని సుకుమార్ గారు చెప్పారు. రాజు గారు సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేశారు. క్యారెక్టరైజేషన్ సెల్ఫిష్  మాస్ లవ్ స్టొరీ. మీ అందరికీ నచ్చుతుంది. నా గురువు గారు సుకుమార్. ఆయన గురువు గారు రాజు గారు. ఈ ఇద్దరూ కలసి నన్ను దర్శకుడిగా పరిచయం చేయడం ఆనందంగా అదృష్టంగా అనిపిస్తోంది. ఆశిష్ తన పాత్రని అద్భుతంగా చేస్తున్నారు. మిక్కీ జే మేయర్ గారు మంచి ట్యూన్ ఇచ్చారు. రామజోగయ్య శాస్త్రి గారు చాలా అద్భుతమైన సాహిత్యం రాశారు. శిరీష్ గారికి మాటీంకి అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.     
 
రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. ఆశిష్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ సినిమా ఆశిష్ కి గొప్ప విజయాన్ని ఇస్తుంది. దీనికి కారణం డిఫరెంట్ పాయింట్, సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన కాశీ విశాల్ స్క్రిప్ట్, మంచి ప్రొడక్షన్ వాల్యూస్, మిక్కీ జే మేయర్ మ్యూజిక్.. ఇలా అన్నీ చక్కగా కుదిరాయి. ఈ పాట మీకు నచ్చడానికి కారణం దర్శకుడు ఇచ్చిన ఇన్ పుట్. సినిమా చూసినప్పుడు ఇంకా మంచి అనుభూతి పొందుతారు. అలాగే ఈ పాట ఇంత అందంగా రావడానికి కారణం రాజు గారి ప్యాషన్. అందరినీ సంధానం చేస్తూ పట్టువదని విక్రమార్కుడిలా కృషి  చేశారు. రాసినప్పుడే ఈ పాట బ్లాక్ బస్టర్ అని అర్ధమైయింది. పాటలానే సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అన్నారు.
 
హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అశోక్ బండ్రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. జె యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.
సెల్ఫిష్ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.