మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: మంగళవారం, 8 మే 2018 (17:18 IST)

తేజ త‌దుప‌రి చిత్రం ఇదే..!

చిత్రం సినిమాతో సంచ‌ల‌నం సృష్టించిన సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ తేజ‌. ఆ త‌ర్వాత వ‌రుస విజ‌యాలు సాధించినా.. అదే స్థాయిలో వ‌రుస ఫ్లాపులు కూడా సాధించి కెరీర్‌లో బాగా వెన‌ుక‌బ‌డిపోయాడు. ఈ టైమ్‌లో ''నేనే రాజు నేనే మంత్రి'' సినిమాతో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడు.

చిత్రం సినిమాతో సంచ‌ల‌నం సృష్టించిన సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ తేజ‌. ఆ త‌ర్వాత వ‌రుస విజ‌యాలు సాధించినా.. అదే స్థాయిలో వ‌రుస ఫ్లాపులు కూడా సాధించి కెరీర్‌లో బాగా వెన‌ుక‌బ‌డిపోయాడు. ఈ టైమ్‌లో ''నేనే రాజు నేనే మంత్రి'' సినిమాతో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడు. ఈ సినిమా ఇచ్చిన విజ‌యంతో ఊహించ‌ని విధంగా ఎన్టీఆర్ బ‌యోపిక్ తెర‌కెక్కించే ఛాన్స్ ద‌క్కించుకున్నాడు. 
 
అయితే... అనుకోని కార‌ణాల వ‌ల‌న ఈ ప్రాజెక్ట్ నుంచి తేజ త‌ప్పుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ కంటే ముందుగా వెంకీతో సినిమా చేసేందుకు ప్లాన్ చేసాడు. ఈ మూవీ కూడా సెట్స్ పైకి వెళ్ల‌కుండానే ఆగిపోయింది. దీంతో తేజ టాలీవుడ్ కింగ్ నాగార్జున‌తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు అంటూ వార్త‌లు వ‌చ్చాయి. కానీ...క్లారిటీ లేదు. లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే.. తేజ రానాతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. 
 
ఇటీవ‌ల తేజ‌ 1971 ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో ఒక కథను తయారుచేసి రానాకు చెప్పాడని, రానా అందుకు అంగీకరించారని తెలిసింది. ఈ కథలో రానా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలెట్‌గా కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. మ‌రి... తేజ రానాతో సినిమా చేయ‌డం అనేది వాస్త‌వ‌మా..? అవాస్త‌వ‌మా? అనేది తెలియాల్సి వుంది.