శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 3 జూన్ 2019 (11:57 IST)

నువ్వే అబ్బాయిని వెతుక్కుని పెళ్లి చేసుకో.. నచ్చకపోతే వదిలేయ్ అని చెప్పా...

సినీ దర్శకుడు తేజ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తెకు పెళ్లి చేయబోనని స్పష్టంచేశారు. అయితే, ఆమె అబ్బాయిని వెతుక్కుని పెళ్లి చేసుకోమని చెప్పానని, ఒకవేళ చేసుకున్న అబ్బాయి నచ్చకపోతే అతన్ని వదిలివేయాలని సలహా ఇచ్చినట్టు తేజ వెల్లడించారు. 
 
ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పెళ్లి పేరుతో డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేయడం తనకు ఇష్టముండదన్నారు. అందుకే మా అమ్మాయికి చాలా క్రితమే ఓ విషయం తేల్చి చెప్పినట్టు చెప్పారు. 
 
ముఖ్యంగా "నేను అయితే పెళ్లి చేయను. నువ్వే అబ్బాయిని వెతుక్కోవాలి. పెళ్లి చేసుకోవాలి. నేను శుభ లేఖలు సిద్ధం చేయించి, ఇంటింటికి వెళ్లి మా అమ్మాయి పెళ్లి.. మీరు తప్పుకుండా రావాలి అని చెప్పనని" చెప్పినట్టు వెల్లడించారు.
 
అంతేకాకుండా, "పెళ్ళిళ్ళ కోసం డబ్బులు వేస్ట్ చేయబోనని, నువ్వే పెళ్లి చేసుకో, ఒక యేడాది అయిన తర్వాత నచ్చకపోతే వదిలేయ్.. సంతోషంగా ఉండు. సమాజం కోసం.. పక్కింటివాళ్ల కోసం పెళ్ళికి ఇంతమంది వచ్చారు కదా అని నువ్వు కష్టపడి కాపురం చేయక. నీకు ఎప్పుడు నచ్చకపోతే అపుడు వదిలేసెయ్" అని చెప్పినట్టు దర్శకుడు తేజ వెల్లడించారు.