యాంగ్రీ యంగ్ మెన్ గా సలీం-జావేద్ పై డాక్యుమెంటరీ
సలీం ఖాన్, జావేద్ అక్తర్ బాలీవుడ్ సినిమా రచయితలుగా విప్తవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. వారిద్దరు ఎన్నో సినిమాకు పనిచేశారు. స్క్రీన్ రైటర్స్ గా 1970 లలో భారతీయ సినిమాల్లో ఫార్ములాను పూర్తిగా మార్చేశారు. అలా వచ్చినవే జంజీర్, దీవార్, షోలే, డాన్ సినిమాలు. అప్పట్లో సినిమా పరిశ్రమను ఒక ఊపు ఊపాయి. రచయితలంటే ఇలా వుండాలనేలా వారిద్దరూ పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు వారి వారసులు సల్మాన్ ఖాన్, ఫర్హాన్ అక్తర్ లు కూడా తమ తండ్రులకు కానుకగా `నాన్నకు ప్రేమతో` అనేలా వారిపై ఓ డాక్యుమెంటరీని తయారుచేస్తున్నారు.
భారతీయ స్క్రీన్ రైటర్స్ గా ఓ హోదా తెచ్చిన వారి గురించి అంతే రేంజ్ లో ఈ డాక్యుమెంటరీ వుండబోతోంది. సల్మాన్ ఖాన్ (సలీం కుమారుడు) (సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్), ఫర్హాన్ అక్తర్ (జావేద్ కుమారుడు), రితేష్ సిధ్వానీ (ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్), జోయా అక్తర్ (జావేద్స్ కుమార్తె), రీమా కాగ్టి (టైగర్ బేబీ ఫిల్మ్స్) సంయుక్తంగా కలిపి నిర్మాణం చేయబోతున్నారు. నమ్రతా రావు దర్శకత్వం వహిస్తున్న ఈ డాక్యుమెంటరీని ఇప్పటివరకు రాని విధంగా విభిన్నంగా ఆవిష్కరించనున్నారు.