Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

కర్ణాటక సంగీత వైతాళికుడు బాలమురళీకృష్ణ జయంతి నేడు

Written By సెల్వి
Updated: బుధవారం, 6 జులై 2022 (15:51 IST)
Mangalampalli
కర్ణాటక సంగీతం‌ 1910 తరువాత జనాదరణకు దూరమైపోయింది. ఆ తరుణంలో దాన్ని బతికించి, జనాళి ఆమోదాన్ని, ఆదరణను పొందేట్టు చేసిన మేధావంతమైన కళాకారులు మహారాజపురం విశ్వనాద అయ్యర్, జి.ఎన్.‌బాలసుబ్రహ్మణ్యన్ తదితరులు వున్నారు. తమ మేధతో, గానప్రతిభతో కర్ణాటక సంగీతానికి పునః వైభవాన్ని తీసుకువచ్చారు. 
 
అటు తరువాత బాలమురళీకృష్ణ కర్ణాటక సంగీతానికి పెను ఊపును తీసుకు వచ్చారు. ఒక దశలో బాలమురళి పాడేది సంగీతం కాదని మద్రాస్ కోర్ట్ లో కేసు కూడా జరిగింది. ఆ కేసులో బాలమురళి విజయం సాధించారు. బాలమురళి విజయం కర్ణాటక సంగీతం విజయం.‌ బాలమురళి స్ఫూర్తిగా ఎందరో గాయకులు వచ్చారు. ఆయన ఆదిగా కర్ణాటక సంగీతంలోకి మేధ వచ్చింది.
 
బాలమురళి వేదిక ఎక్కగానే సరస్వతి‌ వారిని అవహిస్తుంది. వారు సంగీతం పాడరు. మామూలుగా శాస్త్రీయ సంగీత గాయకులు‌ కఠోరమైన సాధన‌ చేస్తారు. బాలమురళి చెయ్యరు. సభలో పాడడానికి కూర్చున్నాక, గళం విప్పాక వారి నుంచి సంగీతం‌ వచ్చేస్తుంది. 
 
బాలమురళి నాలుకపై‌ అమ్మ‌వారు గానంగా ప్రతిబింబిస్తుంది. బాలమురళి సంగీతంలో ఒక బాలమేధావి. వారు ఒక శాస్త్రీయ సంగీత‌‌ పరిశోధకులు. కర్ణాటక సంగీతంలో వారు ఒక విప్లవం.
 
సాహిత్యాన్ని చంపకుండా, జిడ్డు లేకుండా గొప్పగా పాడగలిగిన వారు ఆయన. సంగీతంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. తొలిదశలో జి.ఎన్. బాలసుబ్రహ్మణ్యన్ గానాన్ని ఆదర్శంగా తీసుకున్న బాలమురళి తరువాతి కాలంలో కర్ణాటక సంగీత గానానికి అవసరమైన ఆదర్శమయ్యారు. కర్ణాటక సంగీతాన్ని తమ గానంతో ఉజ్జ్వలనం చేశారు.  
 
మంగళం గారు విశేషమైన సంగీత కళాకారులూ, వేత్త మాత్రమే కాదు ఓ కవి కూడా.  ఎన్నో అద్భుతమైన కీర్తనలు రాశారు. మంచి వచనం రాశారు‌. తెలుగు, తమిళ, సంస్కృతం భాషల్లో కీర్తనలు రాశారు. ఆ భాషల్లో వారు రాసిన‌ కీర్తనలు సూర్యకాంతి పేరుతో పుస్తకంగా వచ్చాయి.  

అన్నీ చూడండి

కెనడాలో పాడుతూ ఆకట్టుకున్న తెలుగమ్మాయి దీపికా డమెర్లా - Video Viral

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ కోసం ప్రాణాలు కోల్పోయాడు.. మల్కారం క్వారీలో బండరాయిపై...?

Transgender: ఎంబీబీఎస్, ఎండీ పూర్తి చేసి ఈఎస్ఐలో చేరిన ట్రాన్స్‌జెండర్ మహిళ

అక్టోబర్ 10 నుండి 20, 2026 వరకు ఇంటర్ విద్యార్థులకు దసరా సెలవులు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. కమిటీల ఎంపిక.. పవన్ కల్యాణ్ ప్రకటన

అన్నీ చూడండి

మటన్ కైమా ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ఈ దీపావళి వేళ, మీ ప్రతి స్నేహితునికీ బాదం పప్పులను బహుమతిగా ఇవ్వండి

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఎందుకని?

LDL కొలెస్ట్రాల్‌పై 5 సాధారణ అపోహలు- వాస్తవాలు: ఆరోగ్యంగా ఉన్నట్లనిపించడం అంటే గుండె కూడా సురక్షితంగా ఉందని కాదు

టైప్ 2 డయాబెటిస్ వ్యాధి అదుపు చేసే మార్గాలు

తర్వాతి కథనం
Show comments