మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 జులై 2022 (15:13 IST)

అగ్నివీర్‌లుగా చేరేందుకు 7.5 లక్షల దరఖాస్తులు

agnipath
అగ్నిపథ్ పథకం కింద తమ పేర్లను నమోదు చేసేందుు దేశ యువత అమితాసక్తిని చూపుతోంది. ఈ ప్రక్రియలో ఇప్పటికే 7.5 లక్షల మంది అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. కేంద్రం అగ్నిపథ్ పథకాన్ని ప్రారంభించిన 10 రోజుల తర్వాత జూన్ 24న ఐఏఎఫ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది.
 
ఐఏఎఫ్ వర్గాల ప్రకారం ఏ రిక్రూట్‌మెంట్ సైకిల్‌లోనైనా అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు 6,31,528 కాగా, ఈ సంవత్సరం అగ్నిపథ్ పథకం కింద 7,49,899 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపింది. 
 
'అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్ కోసం ఐఏఎఫ్ నిర్వహించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. గతంలో 6,31,528 దరఖాస్తులతో పోలిస్తే, ఇది ఏ రిక్రూట్‌మెంట్ సైకిల్‌లోనూ అత్యధికం. ఈసారి 7,49,899 దరఖాస్తులు వచ్చాయి అని ఐఎఎఫ్ మంగళవారం ట్వీట్ చేసింది.
 
కొత్తగా ప్రారంభించిన పథకానికి వ్యతిరేకంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో నిరసనలు ఉన్నప్పటికీ ఈ సంఖ్య వచ్చింది. ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొన్ని చోట్ల నిరసనలు హింసాత్మకంగా మారడం గమనార్హం.
 
అయితే, ఈ కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోబోమని జూన్ 19న మిలటరీ వ్యవహారాల విభాగం అదనపు సెసీ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరి స్పష్టం చేశారు, "దేశాన్ని యవ్వనంగా మార్చడానికి ఇది ఏకైక ప్రగతిశీల దశ" అని అన్నారు.