మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 జూన్ 2022 (13:32 IST)

అగ్నిపథ్ స్కీమ్‌... వివరాలేంటి.. ఎయిర్​ఫోర్స్​లో పోస్టులకు నోటిఫికేషన్

army
కేంద్ర ప్రభుత్వం కొత్తగా అగ్నిపథ్​ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీం ద్వారా ఆర్మీ, నేవి, వైమానిక దళాల్లో నిర్ణీత కాలం పాటు సేవలు అందించడానికి యువతను రిక్రూట్‌మెంట్ చేసుకుంటుంది. డిఫెన్స్​లో షార్ట్ టర్మ్ సర్వీస్ కోసం యువతను చేర్చుకునేందుకు ఈ పథకం అమలులోకి వచ్చింది. 
 
ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి త్రివిధ దళాల్లో నాలుగేళ్లపాటు బాధ్యతలు అప్పగిస్తారు. ఈ పథకం కింద రిక్రూట్ అయినవారినే అగ్నివీర్స్ అంటారు. ప్రస్తుతం ఆర్మీ, ఎయిర్​ఫోర్స్​లో పోస్టులకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది.
 
అగ్నిపథ్​ రిక్రూట్​మెంట్​లో ఎంపికైన అభ్యర్థులు నాలుగేళ్ల సర్వీస్​ పూర్తైన తర్వాత 25 శాతం మందిని రెగ్యులర్ కేడర్‌లో చేర్చుకుంటారు. రెగ్యులర్ కేడర్‌లో చేరినవారు 15 ఏళ్ల పాటు నాన్ ఆఫీసర్ ర్యాంక్స్‌లో పనిచేయాల్సి ఉంటుంది. ఇక మిగతా 75 శాతం మందికి ఎగ్జిట్ అవకాశం కల్పిస్తారు. 
 
ఎగ్జిట్ సమయంలో రూ.11 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు సేవా నిధి ప్యాకేజీ, స్కిల్ సర్టిఫికెట్స్ లభిస్తాయి. వారికి ఎలాంటి పెన్షన్ బెనిఫిట్స్ ఉండవు. అయితే ఆ తర్వాత మరో కెరీర్‌లో స్థిరపడేందుకు బ్యాంకుల నుంచి రుణాలు లభిస్తాయి. 
 
అగ్నిపథ్‌ పథకం కింద సైన్యంలో చేరే వారందరినీ నాలుగేళ్ల తర్వాత విధుల నుంచి తొలగించనున్నట్లు సైన్యం తాజాగా జారీచేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. 
 
ఇందులో 25% మందిని రెగ్యులర్‌ సర్వీసులోకి తీసుకోవడమన్నది పూర్తిగా తమ పరిధిలోని అంశమని, ఆ విషయంలో అగ్నివీరులకు ఎలాంటి హక్కు ఉండదని స్పష్టంచేసింది.
 
ప్రతి బ్యాచ్‌లో 25% మందికి మించకుండా అగ్నివీరులను రెగ్యులర్‌ కేడర్‌లోకి తీసుకుంటుంది. ఇలా సాధారణ కేడర్‌లో చేరిన వారు ఉద్యోగ విధివిధానాలకు లోబడి తదుపరి 15 ఏళ్లు పనిచేయాల్సి ఉంటుంది. 
 
అగ్నివీరులకు ఎలాంటి పింఛను, గ్రాట్యుటీ, మాజీ సైనికోద్యోగులకు వర్తింపజేసే కంట్రిబ్యూటరీ హెల్త్‌ స్కీం, క్యాంటీన్‌ స్టోర్స్‌ డిపార్ట్‌మెంట్‌ (సీఎస్‌డీ) సౌకర్యం, మాజీ సైనికోద్యోగి హోదా, ఇతర ప్రయోజనాలు ఉండవు.  
 
ఇండియన్‌ ఆర్మీ అగ్నివీర్‌ ర్యాలీ నోటిఫికేషన్‌ ద్వారా టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌, ట్రేడ్స్‌మ్యాన్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు తేదీలు త్వరలో వెల్లడించనుంది.
 
జీతం: మొదటి ఏడాది నెలకు రూ.30000 + అలవెన్సులు, రెండో ఏడాది నెలకు రూ.33000 + అలవెన్సులు, మూడో ఏడాది నెలకు రూ.36500 + వర్తించే అలవెన్సులు, నాలుగో ఏడాది నెలకు రూ.40000 + వర్తించే అలవెన్సులు అందజేస్తారు.
 
సెలెక్షన్​ ప్రాసెస్​: ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.joinindianarmy.nic.in వెబ్​సైట్ సంప్రదించాలి.