Daily Horoscope
✕

దుల్క‌ర్ స‌ల్మాన్‌`లెఫ్ట్‌నెంట్ రామ్‌` గ్లిమ్స్ విడుద‌ల‌

Updated: బుధవారం, 28 జులై 2021 (19:03 IST)
Dulquer Salman
దుల్క‌ర్ స‌ల్మాన్ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. తెలుగులో ఆయ‌న న‌టించిన మొద‌టి సినిమా `మ‌హాన‌టి` ఘ‌న విజ‌యం సాధించింది. ఇప్పుడు అదే బేన‌ర్ స్వ‌ప్న సినిమా ప‌తాకంపై దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా మ‌రో సినిమా రూపొందుతోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రంలో లెఫ్ట్‌నెంట్ రామ్‌గా దుల్క‌ర్‌ స‌ల్మాన్ న‌టిస్తున్నారు. సెన్సిబుల్ డైరెక్ట‌ర్ హను రాఘవపూడి దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాత అశ్వినిద‌త్ నిర్మిస్తున్నారు.
 
బుధ‌వారంనాడు దుల్కర్ బర్త్ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ తాజాగా ఓ గ్లిమ్స్ ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ గ్లిమ్స్‌లో లెఫ్ట్‌నెంట్ రామ్‌గా దుల్క‌ర్ స‌ల్మాన్ ఆక‌ట్టుకున్నారు. ఇది త‌న బ‌ర్త్‌డేకి ప‌ర్‌ఫెక్ట్ గిఫ్ట్ అని దుల్క‌ర్  తెలిపారు.
- పీరియ‌డ్ ల‌వ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న సార‌థ్యంలో  కాశ్మీర్‌లోని ప‌లు అంద‌మైన  లోకేష‌న్స్‌లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు.
- హార్ట్ ట‌చింగ్ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్స్ తెర‌కెక్కించ‌డంలో ప్ర‌సిద్ది చెందిన హను రాఘ‌వ‌పూడి మ‌రో ఆస‌క్తిక‌ర అంశాల‌తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు.
 
- ఈ సంద‌ర్భంగా విడుద‌ల‌చేసిన పోస్ట‌ర్లో దుల్క‌ర్ స‌ల్మాన్ చేతిలో ఒక లెట‌ర్ ప‌ట్టుకుని న‌వ్వుతూ సైకిల్‌మీద కూర్చొని ఉన్నాడు. భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల‌లో రూపొందుతోంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖ‌ర్ సంగీతం స‌మ‌కూరున్నారు.
 
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: హ‌ను రాఘ‌వ‌పూడి, నిర్మాత‌:  ప్రియాంక‌ద‌త్‌, బ్యాన‌ర్‌: స్వ‌ప్న సినిమా, స‌మ‌ర్ప‌ణ‌: వైజ‌యంతి మూవీస్‌, సంగీతం: విశాల్ చంద్ర‌శేఖ‌ర్,  సినిమాటోగ్రాఫ‌ర్‌: పీఎస్ వినోద్‌, ఎడిట‌ర్: కోట‌గిరి వెంకటేశ్వ‌ర రావు, ఆర్ట్‌: వైష్ణ‌వి రెడ్డి.

అన్నీ చూడండి

తిరుప్పరంకుండ్రం కొండపై వెలగని కార్తీక దీపం.. విజయ్ సర్కారుకు తప్పని తిప్పలు

15మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు.. డబ్బు, నగలే కాదు.. అవన్నీ దోచుకున్నాడు..

సుప్రీంకోర్టు ఉత్తర్వును ధిక్కరించిన విజయ్ ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదం చేసింది: అన్నామలై

పంచాయతీ ఎన్నికలు.. సైలెంట్‌గా వున్న జగన్ అండ్ వైసీపీ శ్రేణులు.. ఎందుకని?

తుని గొల్లఅప్పారావు శివాలయం ఎదుట భిక్షాటన: జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన గోర్లి నరసయ్యమ్మ, ఎందుకు?

అన్నీ చూడండి

లివర్ వ్యాధి ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పురుషులకు వచ్చే నాలుగు ప్రధాన క్యాన్సర్లలో ఒకటిగా నిలిచిన ప్రోస్టేట్‌ క్యాన్సర్‌

రిలాప్స్‌-రెఫ్రాక్టరీ మల్టిపుల్‌ మైలోమా చికిత్సకు సీడీఎస్‌సీఓ ఆమోదిత బ్లెన్‌రెప్‌ను అందుబాటులోకి తెచ్చిన జీఎస్‌కే

విటమిన్ డి లోపంతో వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి?

క్యాన్సర్ స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు సేవలను ప్రజల ఇంటి వద్దకే తీసుకువస్తోన్న మీనాక్షి ఎనర్జీ

తర్వాతి కథనం
Show comments